విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా జరుపుకునే రైతు దినోత్సవం నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సందేశం. “డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేళ జరుపుకుంటున్న రైతు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వైయస్ఆర్ గా పిలుపునందుకునే రాజశేఖర్ రెడ్డి సమాజంలోని అణగారిన వర్గాలకు సేవ చేయాలని బలంగా విశ్వసించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ వై.ఎస్. రాజశేఖరరెడ్డి వ్యవసాయ రంగాన్ని మెరుగుపరచడంతో పాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా పేద, అణగారిన ప్రజల సంక్షేమంపై ఎక్కువ దృష్టి పెట్టారు. ఇది ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్ సంకల్పం, అంకితభావానికి నిదర్శనం. మానవతా దృక్పథంతో, ప్రజల శ్రేయస్సు పట్ల శ్రద్ధ చూపినందుకు ఆయన జనం మనస్సులలో ఎప్పటికీ గుర్తుండిపోతారు. నిజమైన భూమి పుత్రునిగా నివాళులర్పిస్తూ వైఎస్ఆర్ జయంతిని ‘రైతు దినోత్సవం’గా నిర్వహించడం సముచితం. సంక్షేమ కార్యక్రమాల రూపశిల్పి దివంగత డాక్టర్ వైఎస్‌అర్ కు నివాళులు అర్పిస్తున్నాను”.అని గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ పేర్కొన్నారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …