-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, గురువారం కొత్తపేట కె.టి రోడ్ నందు పూర్తి కాబడిన సి.సి. రోడ్ పరిశీలించి నెహ్రు బొమ్మ సెంటర్ నుండి చిట్టినగర్ జంక్షన్ వరకు ఒక వైపు రోడ్ పనులు అన్నియు పూర్తి అయినందున ట్రాఫిక్ వ్యవస్థకు ఇబ్బంది కలుగకుండా రోడ్ పై ఉన్న నిర్మాణపు సామగ్రి మరియు మట్టిని తొలగించి సదరు రోడ్ ను వెనువంటనే వినియోగంలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా సదరు రోడు నందలి డ్రెయిన్ నుండి రోడ్ వరకు గల ఖాళి నందు రోడ్డునకు సమానతరంగా డస్ట్ వేసి పెల్వర్ బ్లాక్స్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. అదే విధంగా రెండోవ వైపున రోడ్ పనులు కూడా సత్వరమే చేపట్టునట్లుగా చర్యలు తీసుకోవాలని అన్నారు. కాగా కమిషనర్ వారి ఆదేశాలకు అనుగుణంగా అధికారులు నెహ్రు బొమ్మ సెంటర్ నుండి చిట్టినగర్ జంక్షన్ వరకు పూర్తి కాబడిన రోడ్ నందు వాహనములను పునరుద్ధరించుట జరిగింది. పర్యటనలో ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.