Breaking News

జగ్గయ్యపేట హైవేపై బస్ స్టేషన్ నిర్మాణానికై స్థల పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. వి.సి. & ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. శుక్రవారం జగ్గయ్యపేట స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, మున్సిపల్ ఛైర్మన్  ఆర్.రాఘవేంద్ర, మున్సి పల్ కమిషనర్  భూపాల్ రెడ్డి , ఏ.పి.ఐ.ఐ.సి. డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణమోహన్ లతో కలిసి హైవే మీద బస్సు స్టేషన్ నిర్మాణ స్థలం కొరకు అన్వేషణ జరిపారు.
గతంలో దాతలు ప్రతిపాదించిన స్థలం బస్సు రాకపోకలకు అనుకూలంగా లేనందు వలన ఆ ప్రతిపాదనను విరమించుకోవడం జరిగింది.
ఆటోనగర్ ప్రాంతంలో పాత హైవేను ఆనుకుని ఉన్న షేర్ మొహమ్మద్ పేట, సర్వే నంబర్లు 237,238 మరియు 239లో ఉన్న ఏ.పి.ఐ.ఐ.సి. వారి స్థలాన్ని పరిశీలించడం జరిగింది. హైవే మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణీకుల సౌకర్యార్ధం 1.20 ఎకరాల స్థలంలో బస్సు స్టేషన్ నిర్మించడానికి అనువుగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం నిర్మించే బస్ స్టేషన్ కొరకు ఆ స్థలాన్ని ఏ.పి.ఐ.ఐ.సి. అధికారులు ఇవ్వడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు.
ఈ బస్ స్టేషన్ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తన నియోజక వర్గ నిధుల నుండి రూ. 50 లక్షలు మరియు CSR ఫండ్స్ నుండి కూడా రూ. 15 లక్షలు సమీకరించడానికి హామీ ఇచ్చారు.
ఈ బస్ స్టేషన్ నిర్మాణాన్ని త్వరగా మొదలు పెట్టేందుకు మరియు ప్రభుత్వ అనుమతులు పొందేందుకు ప్రతిపాదనలను వెంటనే పంపవలసిందిగా ఆర్టీసీ వి.సి. & ఎం.డి. సి.హెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్., ఎన్.టి.ఆర్. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై. దానం మరియు ఏ.పి.ఐ.ఐ.సి. డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణ మోహన్ ని కోరారు. జగ్గయ్య పేట ఎమ్మెల్యే  సామినేని ఉదయభాను  కూడా గవర్నమెంట్ లో అన్ని అనుమతులు తొందరగా సాధించేందుకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
ఈ సందర్శనలో ఏ.పి.ఐ.ఐ.సి. డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణ మోహన్, మున్సిపల్ ఛైర్మన్ ఆర్.రాఘవేంద్ర, వైస్ ఛైర్మన్  ప్రభాకర రెడ్డి, కమిషనర్  భూపాల్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్  నాగేంద్ర రెడ్డి, కృష్ణా కో- ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్  నాగేంద్ర ప్రసాదు లతో పాటు ఆర్టీసీ అధికారులు  కే.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ఈ.డి. (ఆపరేషన్స్), ఎన్.టి.ఆర్. జిల్లా ప్రజా రవాణా అధికారి  ఎం.వై. దానం, సి.సి.ఈ.  శ్రీనివాస రావు, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ రాజశేఖర్, జగ్గయ్య పేట డిపో మేనేజర్  ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
భక్తులు ఒకే రోజులో వేదాద్రి, ముత్యాల మరియు పెనుగంచిప్రోలు ఆలయాలను సందర్శించేలా అనువుగా ఉండేందుకు ఆ 3 ఆలయాలని కలుపుతూ ఒక ప్రత్యేక బస్సు నడపమని ఎన్.టి.ఆర్. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై. దానం మరియు జగ్గయ్య పేట డిపో మేనేజర్ ప్రసాద్ లను ఆర్టీసీ ఎం.డి. సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్ ఆదేశించారు.
జగ్గయ్య పేట నుండి వల్లభ, వైరా మరియు తదితర ప్రాంతాలకు రవాణా సౌకర్యం ఏర్పాటు చేయవలసిందిగా బస్సులు నడపమని ఆర్టీసీ ఎం.డి.  సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ని జగ్గయ్యపేట స్థానిక ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను  కోరారు. ఆర్టీసీ ఎం.డి.  సి.హెచ్.ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. వెంటనే సానుకూలంగా స్పందించి, ఎన్.టి.ఆర్. జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.వై. దానం మరియు జగ్గయ్య పేట డిపో మేనేజర్ ప్రసాద్ లకు సర్వే చేసి ప్రతిపాదనలు పంపించమని ఆదేశించారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *