విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త:
రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే.రోజా ఆదివారం నాడు విశాఖ సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు. ఆలయ పూజారులు, అధికారులతో వేదలాంచనలతో మంత్రిని ఆలయంలోకి ఆహ్వానించారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహా స్వామిని దర్శించుకున్నారు. సింహాచలం రావడం చాలా సంతోషంగా ఉందని, శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శనం చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని మంత్రి రోజా తెలిపారు.
Prajavartha Online Telugu News