928613084

నిరంతరం సబ్బుతో కడగాలా!?

నేటి పత్రిక ప్రజావార్త :

“చేతుల్ని నిరంతరం సబ్బుతో కడుక్కోండి” అంటూ ఫోన్లో వస్తున్న “కరోనా” అనౌన్స్మెంట్ ఫాలో అయ్యి, పొద్దుగాలా సబ్బుతో కడుగుతూ ఉంటే, చేతులకున్న చర్మం హాండ్ గ్లౌజ్ లా ఊడి వచ్చేయొచ్చు. అయినా కూడా కరోనా సోకవచ్చు. Hand washing కరోనా నుండి ప్రొటెక్షన్ ఇవ్వడం నిజమే గానీ, ఎక్కువసార్లు కడుక్కోవడం వల్ల కాదు. సరైన పద్ధతిలో కడగడం వల్ల..

“ఎన్నిసార్లు కడిగాం” అనేది అస్సలు ముఖ్యం కాదు.

ఎప్పుడెప్పుడు కడగాలి ? ఎలా కడగాలి ? ఎంత సేపు కడగాలి ? అనేవి మాత్రమే ముఖ్యం.

ఎప్పుడెప్పుడు ?

1. బయటకు వెళ్లి, ఇంటికి వచ్చిన వెంటనే కడగాలి.

2. బయట ఉన్నప్పుడు ముఖాన్ని తాకాల్సి వస్తే, అలా తాకడానికి ముందే కడుక్కోవాలి.

3. మనం బయటకు వెళ్లక పోయినా, బయట నుండి వచ్చిన వస్తువుల్ని (పాల పేకెట్స్, కూరగాయలు, ఫ్రూట్స్) తాకితే, ఆ వస్తువులతో పాటు చేతుల్ని కూడా సబ్బుతో కడగాలి.

4. తుమ్మినా, దగ్గినా చేతిని అడ్డం పెట్టుకుంటే, అప్పుడు కూడా కడగాలి.

కుటుంబ సభ్యులు అందరూ ఇంట్లోనే ఉండి, బయట నుండి ఏ వస్తువూ ఇంట్లోకి రానట్టయితే, భోజనం చేసేప్పుడు తప్ప చేతులు కడగాల్సిన అవసరమే లేదు.

ఎలా ?

చేతులు ముందు, వెనుక, వేళ్ల సందుల్లో, గోళ్లలో, మోచేతి వరకూ ప్రతీ చదరపు మిల్లీమీటరులో సబ్బుతో రుద్దుకొని, కడుక్కోవాలి. టాప్ (కుళాయి)ని మీరే ఓపెన్ చేసి ఉంటే, టాప్ ని కూడా సబ్బుతో కడగాలి.

ఎంతసేపు ?

మన ఇండియాలో మెజారిటీ (99%) ప్రజలకు, సబ్బుతో చేతులు కడగటం అంటే, సబ్బు రాసుకొని, నురుగు వచ్చేయగానే నీళ్లతో కడిగేయడం. ఇది తప్పుడు విధానం. కనీసం 20 సెకన్ల పాటు సబ్బు నురుగును నిలిపి ఉంచడం కంపల్సరీ. రోజుకు వందసార్లు కడుక్కున్నా10 లేదా 15 సెకన్ల పాటు మాత్రమే సబ్బుతో రుద్దితే, వైరస్ యాక్టివ్ గానే ఉంటుంది. మనం అంకెలు వేగంగా లెక్కపెడతాం. కాబట్టి 30 అంకెలు లెక్కపెడితే, సుమారుగా 20 సెకన్లు అవుతుంది. అనుమానం ఉన్నవారు మొబైల్ షాప్ లో మీ కౌంటింగ్ స్పీడ్ చెక్ చూసుకొని, దాన్ని బట్టి ట్యూన్ చేసుకోండి.

ఆల్మోస్ట్ మనం అందరం నేర్చుకోవాల్సిన అలవాటు,

సబ్బు నురుగును కనీసం 20 సెకన్ల పాటు నిలిపి ఉంచడం.

Check Also

చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ కి కోటి విరాళం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ (CMRF) కోసం శశి విద్యా సంస్థల చైర్మన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *