పెడన, నేటి పత్రిక ప్రజావార్త :
పెడన మున్సిపాలిటీ పరిధిలో రూ.80 లక్షల విలువైన అభివృద్ధి పనులకు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ శంకుస్థాపనలు చేశారు. మంగళవారం ఆయన పెడన మున్సిపాలిటీ 1, 6, 8, 9 సచివాలయాల పరిధిలోని వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాల పనులకు స్థానిక కౌన్సిలర్లు, ప్రజలతో కలసి శంకుస్థాపనలు చేశారు. ఇటీవల పెడన మున్సిపాలిటీలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు సీసీ రోడ్లు, డ్రైనేజీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సచివాలయానికి మంజూరు చేస్తున్న రూ.20 లక్షల నిధులతో పెడన మున్సిపాలిటీ పరిధిలో మొత్తం రూ.80 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించడం ద్వారా లబ్దిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల వివరాలను తెలియపరచడంతో పాటు ప్రజలకున్న సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా గుర్తించడం జరుగుతుందన్నారు. పరిష్కారం కోసం ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువస్తున్న సమస్యలను విని ఊరుకోకుండా సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున నిధులను మంజూరు చేస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి మాటలతో మభ్య పెట్టకుండా చేతల ద్వారా చేసి చూపెడుతున్నారన్నారు. నియోజకవర్గంలోని మిగతా మండలాల్లో సైతం గుర్తించిన సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.
బందరు పోర్టు నిర్మాణంపై అధికారులతో చర్చ :
పెడన మార్కెట్ యార్డు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మచిలీపట్నం పోర్టు అభివృద్ధి అధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భూసేకరణ, పోర్టు కనెక్ట విటీ రహదారులు, మ్యాప్ల పరిశీలన, నిర్మాణ పనులు తదితర అంశాలపై ఆయన చర్చించారు. ఈ అంశంపై త్వరలో బందరు పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరితో కలసి చర్చించనున్నామని, సంబంధిత అధికారులు పూర్తి సమాచారం రావాలని మంత్రి సూచించారు.
ఈ కార్యక్రమంలో పెడన మున్సిపాలిటీ చైర్మన్ బళ్లా జ్ఞాన లింగ జోత్స్నారాణి, వైస్ చైర్మన్లు ఎండి ఖాజా,శ్రీమతి బైలపాటి జ్యోతి, ఆయా వార్డు కౌన్సిలర్లు, ముడా వీసీ శివ నారాయణ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కెవికె. పల్లారావు, మున్సిపల్ కమీషనర్ అంజయ్య, వర్క్ ఇన్ స్పెక్టర్ జి.మోహన్ రావు, కన్వీనర్ బండారు మల్లి, ఫ్లోర్ లీడర్ కటకం ప్రసాద్, కౌన్సిలర్లు బళ్లా గంగయ్య, కొసనం కరుణ కుమారి,రాహేతున్నిసా, అబ్దుల్ మాలిక్, పిచ్చుక సతీష్, మెట్ల గోపి, సిరివేళ్ళ జయేష్,కోమాట్ల అనిల్, ఉమ్మిటి తనూజ, సుబ్రహ్మణ్యం,కోడూరి శ్రీను,ముత్యాల మురళి, నల్ల నాగలక్ష్మి మరియు వైయస్ఆర్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.