Breaking News

టిడ్కో గృహ సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు — ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నగరపాలక సంస్థ పరిధిలో గోసంఘం వద్ద నిర్మిస్తున్న టిడ్కో గృహ సముదాయంలో అన్ని మౌలిక సదుపాయాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మాజీ మంత్రివర్యులు, కృష్ణాజిల్లా వైఎస్ఆర్సిపి అధ్యక్షులు, మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య (నాని) సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం ఉదయం ఆయన 32 వ డివిజన్ పరిధిలోని గో సంఘం సమీపంలో జి ప్లస్ త్రీ ఇళ్ల వద్ద. 1 కోటి 47 లక్షల వ్యయంతో నూతన సిమెంట్ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ నిర్వహించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం టిడ్కో ఇంజనీర్లు, పలువురు లబ్దిదారులతో కలిసి టిడ్కో గృహాలను పరిశీలించారు. మౌలిక సదుపాయాల పనుల పురోగతి, పెండింగ్ పనుల పూర్తిచేయడం, ఎస్టీపీల నిర్మాణాలపై అధికారులతో ఎమ్మెల్యే పేర్ని నాని సమీక్షించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, 10 కోట్ల 56 లక్షల రూపాయల వ్యయంతో పనులను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. తాగునీటి సౌకర్యం, డ్రైనేజీ నిర్మాణం,, ఓవర్ హెడ్ ట్యాంకులు, పార్కులు తదితర మౌలిక సదుపాయాలతో పాటు అంతర్గత రోడ్ల నిర్మాణం, పైపులైన్లు, విద్యుదీకరణ పనులు త్వరితిగతిన పూర్తి చేసి, సకాలంలో గృహాలను లబ్ధిదారులకు అందించగలమని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనులు పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్ , డిప్యూటీ మేయర్ లంకా సూరిబాబ, డ్వామా పిడి జి.వి. సూర్యనారాయణ, టిడ్కో ఎస్ఈ బి. చిన్నోడు, డీఈ సుధాకర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మోదుగుమూడి గణేష్ బాబు, మాజీ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొర్రా విఠల్, మాజీ జెడ్పిటిసి సభ్యుడు లంకె వెంకటేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్, నగర వైఎస్సార్సీపీ అధ్యక్షులు షేక్. సలార్ దాదా, బూరగడ్డ రమేష్ నాయుడు, 32 వ డివిజన్ కార్పొరేటర్ చింతా వెంకటేశ్వర రావు, ఇంఛార్జి చింతా మౌనిక, ఇతర డివిజన్ ల కార్పొరేటర్ లు, ఇంఛార్జి లు, కో – ఆప్షన్ సభ్యులు, నాయకులు, మునిసిపల్ కమిషనర్ జీ. చంద్రయ్య, మున్సిపల్ ఇంజనీర్ పి. శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *