విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములపై నమోదైన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి 22 ఏ 1 (సి) జాబితాలో నమోదైన అర్జీల పరిష్కారం పై నగరంలోని కలెక్టర్ కార్యాలంలో గురువారం రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూములకు సంబంధించి 22 ఏ 1 (సి) జాబితాలో జిల్లా వ్యాప్తంగా సుమారు 101 పెండిరగ్ అర్జీలు మీ`సేవా ద్వారా నమోదు అయ్యాయని, వీటిని సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలను సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. దేవాదాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్ డిల్లీరావు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమీషనర్ అన్నపూర్ణ, భూసేకరణ విభాగ సూపరింటెండెంట్ యం దుర్గాప్రసాద్‌లు ఉన్నారు.
Tags vijayawada
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …