Breaking News

భూములపై నమోదైన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దేవాదాయ శాఖకు సంబంధించిన భూములపై నమోదైన అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. దేవాదాయ శాఖ భూములకు సంబంధించి 22 ఏ 1 (సి) జాబితాలో నమోదైన అర్జీల పరిష్కారం పై నగరంలోని కలెక్టర్‌ కార్యాలంలో గురువారం రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేవాదాయ శాఖ భూములకు సంబంధించి 22 ఏ 1 (సి) జాబితాలో జిల్లా వ్యాప్తంగా సుమారు 101 పెండిరగ్‌ అర్జీలు మీ`సేవా ద్వారా నమోదు అయ్యాయని, వీటిని సంబంధిత అధికారులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి నివేదికలను సమర్పించాలని అధికారులకు ఆదేశించారు. దేవాదాయ, రెవెన్యూ అధికారులు సమన్వయంతో త్వరితగతిన అర్జీలను పరిష్కరించాలని కలెక్టర్‌ ఆదేశించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు, డిఆర్‌వో కె. మోహన్‌కుమార్‌, దేవాదాయ శాఖ అసిస్టెంట్‌ కమీషనర్‌ అన్నపూర్ణ, భూసేకరణ విభాగ సూపరింటెండెంట్‌ యం దుర్గాప్రసాద్‌లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *