మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని పురస్కరించుకుని మచిలీపట్నం లో శనివారం అంబేడ్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.స్థానిక కలెక్టర్ బంగ్లా అవరణలో గల ఉపాధి కల్పన కార్యాలయంలో ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం రాజ్యాంగం పీఠికను అందరితో చదివించారు. ఈ సందర్భంగా విక్టర్ బాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని సంవిధాన్ దివస్ అని కూడా అంటారని, ఇదే రోజును జాతీయ చట్ట దినోత్సవంగా కూడా జరుపుకుంటమన్నారు.1949 నవంబర్ 26న భారతదేశం రాజ్యాంగాన్ని దత్తత చేసుకుందని, ఆ తర్వాత 1950 జనవరి 26 నుంచి భారత్‌లో రాజ్యాంగం అమల్లోకి వచ్చిందని విక్టర్ బాబు వివరించారు.భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్, షెడ్యూల్స్ లోని అంశాలను స్ఫూర్తిగా తీసుకుని దేశ అభివృద్ధి, పురోగతి కోసం ప్రతి ఒక్కరూ పునరంకితమై కృషి చేయాలన్నారు.బి.అర్.అంబేడ్కర్ రాజ్యంగ రచన కమిటీ అధ్యక్షుడు గా రెండేళ్ల 11 నెలలు 18 రోజులు పాటు ఆరోగ్యం సహకరించకపోయినా ప్రపంచ దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మేలైన రాజ్యాంగాన్ని రచించారన్నారు.కుల, మత, జాతీ, వర్ణ వివక్ష లేకుండా ప్రతి పౌరునికి సామాజిక, ఆర్థిక, రాజకీయ సమన్యాయం అందించడమే భారత రాజ్యాంగం లక్ష్యమన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కులతో పాటు విధులు,బాధ్యతలు కూడా చాలా ముఖ్యమని అందరం రాజ్యాంగం పరిరక్షణకు కృషి చేద్దామన్నారు. దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందంటే భారత రాజ్యాంగంలోని అంశాలే ప్రధాన కారణమని, అలాంటి రాజ్యాంగాన్ని స్పూర్తిగా తీసుకుని దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో జూనియర్ అసిస్టెంట్ జి.వెంకటేశ్వర రావు,స్థానిక నిరుద్యోగ యువత పాల్గొన్నారు
Tags machilipatnam
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …