Breaking News

కృష్ణాజిల్లాను ప్రగతి పథంలోకి తీసుకెళ్లాలి… : జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకువెళ్లాలని, అందులో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని జెడ్‌పి చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక అభిలషించారు.
జిల్లా ప్రజాపరిషత్‌ స్థాయీ సంఘాల సమావేశాలు ఆమె అధ్యక్షతన మంగళవారం జెడ్‌పి సమావేశ మందిరంలో నిర్వహించారు. తొలుత ఆమె భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు సమర్పించారు.
ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ సమావేశానికి కొందరు అధికారులు గైర్హాజరుపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా రాకపోతే చర్యలు తప్పవని ఆమె ఈ సందర్భంగా హెచ్చరించారు.
తొలుత 2 వ స్థాయి సంఘ సమావేశం గ్రామీణ అభివృద్ధిపై జడ్పీ చైర్ పర్సన్ అధ్యక్షులను జరిగింది. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ, నీటి యాజమాన్య సంస్థ, గృహ నిర్మాణ సంస్థ, చేనేత జౌళీ , ఉపాధి కార్యాలయం, పరిశ్రమల కేంద్ర శాఖలలో జరిగిన ప్రగతి గూర్చి సంబంధిత శాఖ అధికారులు వివరించారు. జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక కృష్ణాజిల్లాలో అమృత్ సరోవర్ ప్రాజెక్టు గురించి వివరించమని కోరగా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ జివి సూర్యనారాయణ మాట్లాడుతూ, భవిష్యత్తు అవసరాల నిమిత్తం నీటిని సంరక్షించాలనే ఉద్దేశ్యంతో, ప్రధాన మంత్రి 24 ఏప్రిల్ 2022న మిషన్ అమృత్ సరోవర్ పేరుతో కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారని తెలిపారు.ఈ మిషన్ ద్వారా జిల్లాలో 75 అమృత్ సరోవర్ చెరువుల అభివృద్ధి పునరుజ్జీవనం లక్ష్యంగా ఏర్పరచుకున్నట్లు తెలిపారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా దేశంలోని ప్రతి జిల్లాలో నీటి వనరులు పెంపొందించుకున్నట్లు వివరించారు. కృష్ణాజిల్లా లో 25 అమృత్ సరోవర్ చెరువులను 140.43 లక్షల వ్యయంతో అభివృద్ధి పరుస్తున్నట్లు తెలిపారు. అవనిగడ్డ మండలంలో 6 లక్షల 40 వేల రూపాయలతో 3 అమృత్ సరోవర్ చెరువులు, పెడన నియోజవర్గంలో 14 లక్షల 17 వేల రూపాయలతో 2 చెరువులు, మచిలీపట్నం నియోజవర్గంలో 18 లక్షల 70 వేల రూపాయలతో 2 అమృత్ సరోవర్ చెరువులు, గుడివాడ నియోజకవర్గంలో 24 లక్షల 90 వేల రూపాయలతో ఆరు చెరువులు, పామర్రు నియోజవర్గంలో 2 లక్షల 40 వేల రూపాయలతో 1 చెరువు, పెనమలూరు నియోజకవర్గం లో 12 లక్షల 90 వేల రూపాయలతో 3 అమృత్ సరోవర్ చెరువులు, గన్నవరం నియోజవర్గంలో 60 లక్షల 96 వేల రూపాయలతో 8 అమృత్ సరోవర్ చెరువులు నిర్మిస్తున్నట్లు తెలిపారు.
అనంతరం 3వ స్థాయి సంఘం జిల్లా పరిషత్‌ చైర్ పర్సన్ అధ్యక్షతన ప్రారంభమైంది. వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, పశుసంవర్ధక శాఖ, మత్స్య శాఖ, పౌరసరఫరాల శాఖ, సహకార శాఖ సూక్ష్మ సేద్య ప్రాజెక్టు, నీటిపారుదల అభివృద్ధి సంస్థ, వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖల ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ఖరీఫ్ పంట ఎంతో ఆశాజనకంగా ఉందని రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు మరింత చుడుగ్గా కోనసాగారన్నారు. గతంలో ప్రకృతి వైపరీత్యాలు తుపాను సమయంలో నష్టపోయిన వారికి నష్టపరిహారం అందించాలని గూడూరు జడ్పిటిసి శ్రీనివాస్ కోరారు. వైవిఎస్ జిల్లా వ్యవసాయ అధికారి వైవిఎస్ మనోహర్ రావు కృష్ణాజిల్లాలో వ్యవసాయ శాఖ చేపడుతున్న వివిధ వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమం వివరాలు అందించారు. ఖరీఫ్ పంట సాధారణ సాగు 1,82,861 హెక్టార్లని 2022-23 సంవత్సరానికి 1,65,868 హెక్టార్లలో 1,58,290 రైతులు వరి సాగు చేశారన్నారు. 3,585 హెక్టార్లలో చెరకు పంట సాగు జరిగిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వ్యవసాయ అధికారిణి ఎం విజయ భారతి మాట్లాడుతూ, ఈ ఏడాది వరి పంటను 46,186 హెక్టార్లలో, మొక్కజొన్న పంటను 2,992 హెక్టార్లలో, పెసలు 2,684 హెక్టార్లలో, మినుములు 1,991 హెక్టార్లలో, పత్తి పంటను 39,395 హెక్టార్లలో, మిరప పంటను 18,489 హెక్టార్లలో సాగు చేస్తున్నట్లు వివరించారు. ఈ-పంట నమోదు, వైయస్సార్ పొలంబడి క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన వ్యవసాయ అధికారుల చేత రైతులకు శిక్షణ సైతం అందిస్తున్నట్లు తెలిపారు. పంట రుణాలు విషయానికొస్తే సొంత భూమి కలిగిన 2.25 లక్షల మంది రైతులకు రూ. 4,200 కోట్లు ,19,745 మంది కౌలు రైతులకు రూ.227 కోట్లు సదుపాయం రక్షింగా పెట్టుకుని ఇప్పటివరకు 2.35 లక్షల మంది రైతులకు 3,473 కోట్ల రూపాయలు రుణ సహాయం అందించినట్లు తెలిపారు.
మధ్యాహ్నం 12 గంటల సమయంలో 4 వ స్థాయి సంఘ సమావేశం చైర్ పర్సన్ అధ్యక్షతన జరిగింది. ఇందులో జిల్లా వైద్య ఆరోగ్య, శాఖలో జరిగిన ప్రగతి తో పాటు కోఆర్డినేటర్ కృష్ణాజిల్లా ఆసుపత్రుల సేవ విభాగంలో జరిగిన ప్రగతి, వైయస్సార్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ విభాగంలో జరిగిన ప్రగతి, జిల్లా విద్యాశాఖలో జరిగిన ప్రగతి, సమగ్ర శిశు శాఖ, పౌర గ్రంథాలయ, విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ప్రగతిపై అధికారులు ఇచ్చిన నివేదికపై చర్చించారు.
మధ్యాహ్న భోజనం అనంతరం,1 వ స్థాయి స్థాయి సంఘ సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ స్థాయి సంఘ ఎజెండాలు, అధ్యక్షుల అనుమతితో ప్రవేశపెట్టబడిన ఇతర అంశాలను చర్చించారు.
5 వ స్థాయీ సంఘ సమావేశంలో స్త్రీ సంక్షేమం, రక్షణ గూర్చి చర్చించారు. జిల్లా స్త్రీ అభివృద్ధి శిశు సంక్షేమ శాఖలో జరిగిన ప్రగతి, జిల్లాలో నందమూరి తారక రామారావు నైపుణ్యాభివృద్ధి మహిళా సాధికారత కేంద్రం నిమ్మకూరులో జరుగుతున్న ప్రగతిపై అధికారులు నివేదికలు చదివి వినిపించారు. జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక మహిళా, శిశు అభివృద్ధి సంస్థల ద్వారా అందిస్తున్న సేవలు గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లాలోని పలు మండలాలలో అంగన్వాడీ భవనాలు నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయని చెప్పారు.
6 వ స్థాయీ సంఘ సమావేశం జెడ్‌పి చైర్‌పర్సన్‌ అధ్యక్షతన జరిగింది. జిల్లా సాంఘిక సంక్షేమ శాఖలో జరిగిన ప్రగతి, షెడ్యూల్ కులముల సేవా సహకారం సంఘంలో జరిగిన ప్రగతి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ, సహకార సంఘంలో జరిగిన ప్రగతి, గ్రామీణాభివృద్ధి సంస్థలో జరిగిన ప్రగతి, అలాగే వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలో జరిగిన ప్రగతి, వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లో జరిగిన ప్రగతి, జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖలో ప్రగతి, అల్ప సంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థలో జరిగిన ప్రగతి, అలాగే జిల్లా యువజన సంక్షేమ శాఖలో జరిగిన ప్రగతి నివేదికలను సంబంధిత అధికారులు గణాంకాలతో సహా వివరించారు. నియోజక వర్గాల్లో బోర్లు తవ్వకానికి సంబంధించి కాంట్రాక్టర్లు ఎంఒయు చేయించుకోవాడానికి ఎవ్వరూ రావడంలేదని పలువురు సభ్యులు కోరగా జిల్లా పరిషత్‌ ఛైర్పర్సన్‌ మాట్లాడుతూ, రైతు ముందుకు వచ్చి బోర్లు తవ్వకాలు చేపడితే వారికి సంబంధిత నిధులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు. ఇంటి నిర్మాణాల లబ్ధిదారులకు సంబంధిత బిల్లులు చెల్లింపులు జరగడం లేదని ఆమె వివరణ కోరగా, సంబంధిత అధికారి మాట్లాడుతూ గతంలో అప్లోడ్‌ చేసిన వివరాలు గృహ నిర్మాణశాఖకు అందజేయడం జరిగిందని సంబంధిన నిధులు మంజూరు కాలేదని, వచ్చిన వెంటనే చెల్లింపులు చేయడం జరుగుతుందని తెలిపారు.
అనంతరం 7 వ స్థాయి సంఘ సమావేశంలో జిల్లా పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖలో జరిగిన ప్రగతి, గ్రామీణ నీటి సరఫరా, పారిశుద్ధ్య శాఖలో జరిగిన ప్రగతి, నీటి యాజమాన్య సంస్థలో జరిగిన ప్రగతి, ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థలో జరిగిన ప్రగతి, జిల్లా భూగర్భ జల, జల గణన శాఖలో జరిగిన ప్రగతి, రిజిస్ట్రేషన్ స్టాంపులు శాఖలో జరిగిన ప్రగతి, ఆంధ్రప్రదేశ్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ శాఖలో జరిగిన ప్రగతి, ప్రొహేబిషన్, ఎక్సైజ్ శాఖలో జరిగిన ప్రగతి, రీ సర్వేలో జరిగిన ప్రగతి కార్మిక శాఖలో జరిగిన ప్రగతి తదితర అంశాలపై చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో జెడ్‌పి సిఇఒ యు. శ్రీనివాసరావు, జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్, ఏడి మైన్స్ రామచంద్రన్, జెడ్‌పిటిసిలు, కో ఆప్షన్ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *