Breaking News

రీ సర్వే పనులను కృష్ణాజిల్లాలో వేగవంతం చేస్తున్నాం

-జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భూహక్కు- భూరక్ష పత్రాల పంపిణీ ప్రక్రియ, రీ సర్వే పనులను జిల్లాలో సమగ్ర కార్యచరణ, సిబ్బంది సమిష్టి సమన్వయంతో వేగవంతం చేస్తున్నట్లు కృష్ణాజిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా పేర్కొన్నారు. భూహక్కు పత్రాల జారీ, జగనన్న శాశ్వత భూ హక్కుకు సంబంధించిన రీ సర్వే, వివాద స్థలాలపై చర్యలు, మ్యుటేషన్లపై జిల్లా కలెక్టర్లుతో గురువారం మధ్యాహ్నం రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కార్యదర్శి , ప్రత్యేక ముఖ్య కార్యదర్శి జి.సాయిప్రసాద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వారాల తరబడి వాయిదాలు వేయకుండా మిగిలిన రీసర్వే పనులను వచ్చే ఏడాది ఫిబ్రవరి లోపున ఫ్లైయింగ్ పూర్తి చేయాలన్నారు. రీ సర్వే చేస్తున్నప్పుడు ఉత్పన్నమైన సమస్యలను అత్యంత ప్రణాళికాబద్ధంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలని ప్రజలను పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేలా, వారి భూ సమస్యలకు పూర్తిస్థాయి పరిష్కారాలు చూపేలా రీసర్వే ఉండాలన్నారు. ఈ సర్వే ద్వారా రెవెన్యూ వ్యవస్థ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అవుతుందని రికార్డులు, డేటా అంతా స్వచ్ఛీకరణ జరుగుతుందని చెప్పారు. ఈ అంశాలను అధికారులు దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలని సూచించారు. రీ సర్వే అనంతరం కొలత రాళ్లు పని పూర్తిచేయాలని సూచించారు.సమగ్ర సర్వే పూర్తయిన గ్రామాల్లో భూహక్కుదారులకు జగనన్న భూహక్కు – భూరక్ష పత్రాల జారీకి చర్యలు తీసుకోవాలని, మరో వారంలో 22వేల పత్రాలు జారీచేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్ణీత గడువుఆ లోగా మ్యుటేషన్లను తీసుకోవాలని, ఇప్పటివరకు పెండింగులో ఉన్నవాటిపై ఎప్పటికపుడు చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని కలెక్టర్లకు సీసీఎల్ఏ కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, సంయుక్త కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్ , జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటేశ్వర్లు, భూసర్వే, రికార్డుల శాఖ సహాయ సంచాలకులు ఎస్. గోపాలరాజ, పలువురు అధికారులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *