-రెవిన్యూ సిబ్బందికి వర్క్ షాప్ లో పలు సూచనలు
-రీసెర్వేపై పలు విషయాలు తెలియచెప్తూ అనర్గణంగా ప్రసంగించిన కలెక్టర్
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
భూములను అధునాతన సాంకేతిక టెక్నాలజీతో పారదర్శకంగా సర్వే చేసి భూ సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా అన్నారు.
సోమావారం జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్ లో వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ (పిఓఎల్ఆర్) పై జిల్లాలోని తహసీల్దార్ లు, డిప్యూటీ తహసీల్దార్ లు, రెవిన్యూ సిబ్బందితో జిల్లా కలెక్టర్ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మాట్లాడుతూ, భూ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగానే శాశ్వత పరిష్కారం చూపేందుకు వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం ప్రవేశపెట్టారని అన్నారు. వందేళ్ల తర్వాత గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వ్యవసాయ గ్రామ కంఠం, స్థిరాస్తుల సర్వే నిర్వహిస్తున్న నేపథ్యంలో వివాదాలకు స్వస్తి పలికేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. వైయస్సార్ జగనన్న శాశ్వత భూహక్కు, భూ రక్ష పథకం ద్వారా ప్రజల శాశ్వత భూ సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఆ దిశగా రీ సర్వేను వేగవంతంగా పకడ్బందీగా చేపట్టాలన్నారు.
బ్రిటీష్ ప్రభుత్వ హయాం నుంచి మొన్నటి వరకూ గొలుసులతో సర్వే చేసేవారని అందువల్ల ఎకరానికి కొన్ని అడుగులు, కొన్ని గజాలు తేడా వచ్చేదన్నారు. అధికారికంగానే కొంత అటూ ఇటూగా అనుమతించేవారన్నారు. దీంతో ఎప్పుడైనా క్రయవిక్రయాలు జరిగినప్పుడు హద్దుల విషయంలో అక్కడక్కడ గొడవలు చోటుచేసుకునేవన్నారు. ప్రస్తుతం జరుగుతున్న రీ సర్వే అనంతరం ఇకపై ఇలాంటి గొడవలకు తావే ఉండదని కలెక్టర్ రంజిత్ బాషా అన్నారు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో రీ సర్వే చేస్తుండటం వల్ల సెంటీమీటర్లతో సహా లెక్క తేలుతోందని వివరించారు.
ప్రస్తుతం జరుగుతున్న వర్క్ షాప్ లో సందేహాలను నివృత్తి చేసుకొని రీ సర్వేలో ఎటువంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చేపట్టాలన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రంజిత్ భాష దాదాపు గంటకు పైగా సమయం తీసుకొని రీ సర్వే కు సంబంధించిన పలు విషయాలు వర్క్ షాప్ లో వివరించారు. ” సర్వే అంటే ఏమిటి ? సెటిల్మెంట్ అంటే ఏమిటి ? అని కలెక్టర్ తాహసిల్దార్లను ప్రశ్నించగా మచిలీపట్నం తాహసిల్దార్ సునీల్ జవాబిస్తూ, ఫీల్డ్ మీద ఎవరున్నారో చెప్పడం సర్వే అని.. యాజమాన్య హక్కులు నిర్ధారించడం సెటిల్మెంట్ అని జవాబు చెప్పారు. ఒక భూమిని పట్టా భూమి అని ఎలా అంటాం ? జాయింట్ పట్టా అంటే ఏమిటి ? హద్దుల్ని ఎలా నిర్ణయిస్తారు ? 13 నోటిఫికేషన్ అంటే ఏమిటి అని ఉంగుటూరు, పెనమలూరు, ఉయ్యూరు వీఆర్వోలు, గ్రామ సర్వయర్లపై కలెక్టర్ పలు ప్రశ్నలను సంధించారు. ఈ వర్క్ షాప్ లో రీ సర్వే పై అందించిన పుస్తకాలను సమగ్రంగా చదివి వివిధ సమస్యలకు పరిష్కారం తెలుసుకోవాలన్నారు.
బ్రిటిష్ కాలంలో చేసిన సర్వే రికార్డుల ఆధారంగా నేటికి రెవెన్యూ సర్వే వ్యవస్థ నడిపిస్తున్నామని, దాదాపు వంద సంవత్సరాల పైన గల రికార్డుల్లో చాలా తేడాలు, విభేదాలు, భూ సమస్యలు పలుమార్లు తలెత్తుతున్నాయని వాటిని పరిష్కరించేందుకు ఇది మంచి అవకాశం అని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రీ సర్వే భూ సమస్యలు శాశ్వతంగా పరిష్కారం అవుతాయన్నారు. రెవెన్యూ రికార్డులన్నీ ఎలాంటి వివాదం లేకుండా చేసే అవకాశం వచ్చిందని ఆ రకంగా భూ రికార్డులు స్వచ్చికరణ చేయాలన్నారు. రీ సర్వే కొత్త రికార్డు నెలకొల్పడం జరుగుతుందన్నారు. తహసీల్దార్ లు, డిప్యూటీ తహసీల్దార్ లు బాగా అవగాహన కల్పించుకుని అవగాహన లేని గ్రామ సర్వే అసిస్టెంట్ లు, వి ఆర్ ఒలకు అవగాహన కల్పించి రీ సర్వేను వేగంగా ముందుకు తీసుకెళ్లాలి అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి రీ సర్వేను ప్రధాన అజెండాగా చేర్చి స్వయంగా సమీక్ష చేస్తున్నారన్నారు. ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అందరు అర్థం చేసుకొని రీ సర్వేను వేగవంతం చేయాలన్నారు. భూ వివాదాలు, తగాదాలు గ్రామాలు సాక్షాత్కారమే కావడమే రీసర్వే లక్ష్యమన్నారు. ఈ మహా యజ్ఞం ఫలాలు ప్రజలకు సంపూర్ణంగా అందాలన్నారు. ఎక్కడ కూడా సర్వే అసంపూర్తిగా మిగిలిపోయింది అన్నమాట. మొబైల్, ట్రిబనల్, సరిహద్దులు, సబ్ డివిజన్లో ఇవన్నీ చాలా క్రమబద్ధతలో ముందుకు సాగాలని సూచించారు.
ఈ వర్క్ షాప్ లో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా రెవిన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, ముడా వైస్ ఛాన్సలర్ నారాయణరెడ్డి,మచిలీపట్నం,గుడివాడ ఆర్డీవోలు ఐ. కిషోర్, పద్మావతిలు,జిల్లా పంచాయతీ అధికారి నాగేశ్వర్ నాయక్, ల్యాండ్ అండ్ సర్వే ఏడి ఎస్. గోపాల రాజా తదితరులు పాల్గొన్నారు.