Breaking News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి

-గిరిజన బాలబాలికలు చదువుతోపాటు క్రీడలలో రాణించాలి: కేంద్ర సహాయ మంత్రి రేణుక సింగ్ సరూట

తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుమల శ్రీవారిని నేటి ఉదయం దర్శించుకున్న గౌరవ కేంద్ర గిరిజన వ్యవహారాల సహాయ మంత్రి రేణుక సింగ్ సరూట. దర్శనానంతరం ఆమె మాట్లాడుతూ నేడు తిరుమల శ్రీవారిని వేడుకున్నదేమంటే మన దేశం సురక్షితంగా ఉండాలని మన ప్రజలు సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకున్నానని అన్నారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడ లో ఈ నెల 17 నుండి 22 వరకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల జాతీయ క్రీడ పోటీలు 2022 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని గిరిజన క్రీడాకారులను ఉత్తేజ పరిచానని, 22 రాష్ట్రాల నుండి 4000 మందికి పైగా విద్యార్థులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు అని తెలిపారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ధార్మిక వికాసానికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ మంత్రిని మర్యాదపూర్వకంగా తిరుమల అతిథి గృహంలో కలిసిన సందర్భంలో మంత్రి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు చాలా ప్రజా ఉపయోగకరంగా ఉన్నాయని గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట వేసి బడ్జెట్ కేటాయించారనే విషయాలు నిన్నటి రోజున ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర ద్వారా తెలుసుకుని సంతోషిస్తున్నాను అని మంత్రిత్వ శాఖ బాగా పనితీరు బాగుందని అన్నారు. కేంద్రం నుండి గిరిజన శాఖ సహాయ మంత్రిగా రాష్ట్రానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఆజాదీక అమృత్ మహోత్సవ్ లో భాగంగా 50% కన్నా ఎక్కువ గిరిజన జనాభా ఉన్న గ్రామ పంచాయతీలలో పూర్తి అభివృద్ధికి చేయడానికి దేశ వ్యాప్తంగా 34000 పైగా గ్రామాలు గుర్తిస్తే అందులో ఆంధ్రప్రదేశ్ లో 511 పంచాయితీలు గుర్తించబడిన వాటి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి రూ.20 లక్షలు ఈ ఆర్థిక సంవత్సరంలోనే విడుదల చేస్తున్నామని వాటిని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ నిబంధనల మేరకు వినియోగించాలని, దేశ వ్యాప్తంగా ఏకలవ్య మోడల్ స్కూల్ లు ఒక్కొక్కటి కోట్ల రూపాయలతో నిర్మితమైనవి అని నాలుగు విశాలమైన ఆట మైదానాలు ఉంటాయి అని గిరిజన బాల బాలికల విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ లో ఎస్టి కమిషన్ ఐదుగురు సభ్యులతో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని తెలిపారు. వీరితోపాటు జిల్లా గిరిజన సంక్షేమ మరియు సాధికార ఇన్చార్జి అధికారి చెన్నయ్య, వారి సిబ్బంది తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇక 10 నిమిషాల్లోనే రిజిస్ర్టేషన్ పూర్తి

-గంటల కొద్ది వేచి ఉండాల్సిన అవసరం లేదు -స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ -ప్రస్తుతం 26 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *