Breaking News

మాతోఫిలియా-2022

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ విద్యార్థి శ్రీనివాసరామానుజన్‌ను స్పూర్తిగా తీసుకొని గణితంలో పట్టు సాధించాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు. ఈనెల 22వ తేదీ గురువారం ప్రఖ్యాత గణిత మేధావి శ్రీనివాసరామానుజన్‌ జయంతిని పురస్కరించుకొని నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ డే సెలప్రబేషన్స్‌ సందర్భంగా స్థానిక కొత్త పేటలోని కాకరపర్తి భావన్నారాయణ కళాశాలలో మ్యాథమెటిక్స్‌ అండ్‌ స్టాటస్టిక్స్‌ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు నిర్వహించే మాతోఫిలియా-2022ను జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు సమాచార హక్కు చట్టం కమీషనర్‌ యు. హరిప్రసాద్‌ రెడ్డితో కలిసి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ మన దేశానికి చెందిన గణిత శాస్త్ర వేత్త ప్రపంచ ప్రఖ్యాతి గణిత మేధావుల్లో ఒకరైన శ్రీనివాసరామానుజన్‌ అయ్యంగార్‌ చిన్న వయసులోనే గణితంపై ప్రతిభ కనబరిచే వారని గుర్తు చేశారు. ఆయన సొంతంగా రూపొందించిన సిద్దాంతాలే నేటి మన గణితంలో పాఠ్యాంశాలుగా ఉన్నాయన్నారు. అన్ని ఆవిష్కరణలకు గణితం మూలమన్నారు. గణితం అంటే భయపడకూడదని గణితంలోని ప్రాథమిక అంశాలపై అవగాహన ఉంటే ఎటువంటి సిద్దాంతాలైనను సునాయాసంగా చేయవచ్చునన్నారు. పేదరికంలో పుట్టి ఎటువంటి సదుపాయాలు లేకపోయినా పది సంవత్సరాల వయసులోనే శ్రీనివాసరామానుజన్‌ ప్రపంచ ప్రఖ్యాత గణిత మేధావుల్లో ఒకరుగా నిలిచారన్నారు. ఫిజిక్స్‌, కెమిస్ట్రి వంటి సబ్జెక్టులలో ఎన్నో థీరీలకు గణితం మూలమన్నారు. ప్రపంచ వ్యాపంగా శ్రీనివాసరామానుజన్‌ను గౌరవిస్తారని ఆయన గణితంలో సాధించిన ప్రతిభను గుర్తిస్తూ 2012 నుండి ప్రతీ సంవత్సరం నేషనల్‌ మ్యాథమెటిక్స్‌ డే జరుపుకుంటున్నామన్నారు. ప్రపంచానికే గణితంలో ఎన్నో సిద్దాంతాలను అందించిన మన దేశం, మన సమీప దేశాల కన్నా గణితంలో వెనుకబడి ఉండటం దురదృష్టకరమన్నారు. ప్రపంచంలోని ప్రముఖ శాస్త్రవేత్తల ఆవిష్కరణలకు మూలం గణితమే అని అన్నారు. గణితం పట్ల ప్రతీ విద్యార్థి ఉత్సాహం చూపాలన్నారు. బేసిక్‌ ప్యూర్‌ మ్యాథమెటిక్స్‌ పై పట్టు సాధించాలన్నారు. గణితంలోని ప్రతి ఫార్ములాను అర్థం చేసుకొని గుర్తు పెట్టుకోవాలన్నారు. గణితం కష్టమైనది కాదని అర్థం చేసుకుంటే అంత సులువైన పాఠ్యాంశం మరొకటి లేదన్నారు. ప్రతి విద్యార్థి శ్రీనివాసరామానుజన్‌ గణితంలో చేసిన విశేష కృషిని స్పూర్తిగా తీసుకొని కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని కలెక్టర్‌ డిల్లీరావు విద్యార్థులకు ఉద్భోధించారు.
సమాచార హక్కు చట్టం కమీషనర్‌ యు. హరిప్రసాద్‌ రెడ్డి మాట్లాడుతూ గణితం పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. గణితంపై అపోహాలు ఉన్నట్లయితే నివృత్తి చేసుకోవాలన్నారు. ప్రపంచం గర్వించగ్గ గణీత మేధావి శ్రీనివాసరామానుజన్‌ మన దేశానికి చెందిన వాడు కావడం మనకు గర్వ కారణమన్నారు. గణితాన్ని అర్థం చేసుకుంటే అంత సులువైన సబ్జెక్టు మరొకటి లేదన్నారు. గణితాన్ని చూసి భయపడకూడదని ఫండమెంటల్‌ ఫార్ములాలపై పట్టు సాధిస్తే ఎటువంటి కృష్టతరమైన సమ్స్‌ అయినా సులువుగా చేయగలమని అన్నారు.
తొలిత కళాశాలలో గణితం పై విద్యార్థులకు సులువుగా అర్థమయ్యే రీతిలో ఏరియా ఆఫ్‌ సర్కిల్‌ టైప్స్‌ ఆఫ్‌ ఏంజెల్స్‌, ఫైథాగరస్‌ ఆల్జీబ్రా, ఎనాలసిస్‌ అర్థమెటిక్‌, గేమ్‌ తీరీ, నెంబర్‌ తీరి, న్యూమరికల్‌, అనాలసిస్‌, ఆఫ్టిమైజేషన్‌ స్టాటిక్స్‌, టోఫోలజీ, ట్రిగ్నోమెట్రి వంటి బేసిక్స్‌ పై అవగాహన కల్పించే విధంగా ఏర్పాటు చేసిన మాథ్స్‌ ఎక్స్‌పోను కలెక్టర్‌ డిల్లీరావు, ఆర్టీఐ యాక్ట్‌ కమీషనర్‌ ప్రసాద్‌రెడ్డి ప్రారంభించారు.
కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు టి. షేషయ్య ప్రిన్సిపల్‌ వి. నారాయణ రావు, మ్యాథమెటిక్స్‌ డిపార్ట్మెంట్‌ హెడ్‌ ఎం లక్ష్మీ ప్రసన్న, కళాశాల సెక్రెటరీ కరస్పాండెంట్‌ అన్నం రామకృష్ణారావు, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *