-ఎమ్మెల్యే పేర్ని నాని
మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఉన్నతాధికారులు సైతం తరచూ గృహ నిర్మాణం ఇళ్ల స్థలాల విషయమై సమీక్షిస్తున్నారని మాజీ మంత్రివర్యులు మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని వెంకట్రామయ్య( నాని ) పేర్కొన్నారు. మంగళవారం ఆయన కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత్ సింగ్ ను ఆమె కార్యాలయంలో కలిసి మచిలీపట్నం నియోజకవర్గంలోని పలు సమస్యలపై చర్చించారు. ఒకటి రెండు నెలలలో టిడ్కో ఇళ్లు అప్పగించాలనే లక్ష్యంతో పనులపై దృష్టి సారించామని బ్యాంకుల ద్వారా ఇచ్చే రుణాలు ఉపయోపగపడుతున్నాయి. మునిసిపల్, మెప్మా అధికారుల సమన్వయంతో దీనిపై ముందుకెళ్తున్నారన్నారు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన పనులు దాదాపు పూర్తయినట్టు ఎమ్మెల్యే పేర్ని నాని చెప్పారు. ఈ సమావేశంలో మచిలీపట్నం ఆర్డీవో ఐ.కిషోర్, మచిలీపట్నం తహశీల్దార్ సునీల్ బాబు, గృహ నిర్మాణ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.