Breaking News

అర్హులైన వారందరికీ జిల్లా మత్స్యశాఖ అవకాశం ఇవ్వాలి !!

-మత్స్యశాఖ జిల్లాస్థాయి కమిటీ సమావేశంలో.. జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా మత్స్యశాఖ నుంచి లబ్ధి పొందేందుకు వివిధ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారందరికీ అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా మత్స్య శాఖ అధికారిని ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తన చాంబర్లో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన స్కీమ్ కింద మత్స్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
మత్స్య సంపద యోజన స్కీమ్ కింద దరఖాస్తు చేసుకున్నవారి దరఖాస్తులను పరిశీలించి ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. కృష్ణాజిల్లాలో 111 కిలోమీటర్ల సముద్ర తీరం ఉందని , 1 లక్షా 12 వేల 977 మంది మత్స్యకారులు జిల్లాలో నివసిస్తున్నారని పేర్కొంటూ, 4 తీర ప్రాంత మండలాల్లో అత్యధిక శాతం ప్రజలు ఆక్వా రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని తెలిపారు. ఒకవైపున కృష్ణానది మరోవైపున సముద్ర తీర ప్రాంతంలో ఉన్న జిల్లాలో మత్స్య పరిశ్రమ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందలేదని అన్నారు. మన జిల్లాకు ఎంతో విస్తృతమైన వనరులు సహజ సిద్ధంగా ఉన్నాయని ఈ ప్రాంతంలో మత్స్య సంపద పెంపొందించుకొని తద్వారా ప్రజానీకం ఆర్థిక అభివృద్ధి చెందాలని సూచించారు. అనంతరం 6 రకాల అంశాలను చర్చించారు. చేపల చెరువుల నిర్మాణం, వి – సర్క్యులేటరి ఆక్వా కల్చర్ సిస్టం, ఫిష్ ఫీడ్ మీల్, ద్విచక్ర వాహనాలు, ఇన్సులేటర్ త్రీ వీలర్ వాహనాలు, తదితర అంశాలపై చర్చించి కమిటీ సమావేశం తిరిగి మరొకసారి నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ఫిష్ ఆంధ్ర నిర్వహణపై తీసుకోవలసిన నిర్ణయాలను మత్స్యశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అంతే కాకుండా ఫిష్ ఆంధ్ర వాహనాలను జిల్లాకు ఎన్ని కేటాయించారు? ఫిష్ ఆంధ్రా వాహనం లబ్ధిదారుడికి దక్కించుకోవడానికి సబ్సిడీ ఎంత వస్తుందని తెలుసుకున్నారు. మత్స్య ఉత్పత్తుల ఎగుమతుల్లో కొనుగోళ్లలో ఎందుకు మత్స్య శాఖ భాగస్వామ్యం కాకూడదని ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ ను కలెక్టర్ పి. రంజిత్ బాషా ప్రశ్నించారు.చేపలు, రొయ్యల సాగు, ఉత్పత్తి రాష్ట్రంలోనే అధికంగా ఉందని చేపలను ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని అక్కడా సాగు పెరుగుతున్న నేపథ్యంలో రొయ్యల ఎగుమతి విదేశాలకు అధికంగా ఉంటుందని కానీ ధరలు పడిపోయినప్పుడు రైతులు నష్టపోతున్నారనే పరిస్థితుల్ని అధిగమించేందుకు రాష్ట్రంలోనే వినియోగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ పేర్కొన్నారు. వినియోగదారుల ఇంటి వద్దకే తీసుకెళ్లి మత్స్య ఉత్పత్తులు నేరుగా అందించే విధంగా మత్స్యశాఖ ఆధ్వర్యంలో ‘ఫిష్‌ ఆంధ్ర’ బ్రాండ్‌ పేరుతో ప్రాజెక్టు అమలు కానున్నట్లు తెలిపారు.
ఈ కామర్స్ యాప్ ద్వారా తాజా చేపలు, రొయ్యలనే కాకుండా.. ఎండు చేపలు, వండడానికి సిద్ధంగా ఉండే చేపలు, మసాలా పట్టించిన ఉత్పత్తులు, వండిన, ఫ్రై చేసిన వంటకాలు, పచ్చళ్లు వంటి వాటిని రిటైల్‌ ఔట్‌లెట్ల ద్వారా విక్రయించనున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 70 హబ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని కలెక్టర్ చెపుతూ, ఒక్కో హబ్‌కు అనుబంధంగా మత్స్య ఉత్పత్తులకు అదనపు విలువ జోడించే యూనిట్లతో పాటు 14 వేల వరకు రిటైల్‌ అవుట్‌లెట్లు, రిటైల్‌ వెండింగ్‌ ఫుడ్‌కోర్ట్, మొబైల్‌ యూనిట్లు ఉంటాయిన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు కొన్ని హబ్‌లు సిద్ధం చేశారని వీటి పరిధిలో దుకాణాలను అందుబాటులోకి తెస్తున్నారన్నారు. ఈ కామర్స్‌ యాప్‌ ద్వారా వీటిని నేరుగా వినియోగదారునికి అందించనున్నారన్నారు
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం. వెంకటేశ్వర్లు, జిల్లా మత్స్య శాఖ అధికారి ఎన్. శ్రీనివాసరావు, డ్వామా పిడి జీవి సూర్యనారాయణ, డి ఆర్ డి ఏ పిడి సి.ఎస్ ప్రసాద్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఫణి ధూర్జటి, ఇరిగేషన్ ఎస్ఈ కేడీసీసీ బ్యాంక్ జనరల్ మేనేజర్, మత్స్య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు, ఎఫ్ డి ఓ లు తదితరులు పాల్గొన్నారు

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *