-మంత్రి జోగి రమేష్
శీతనపల్లి (కృత్తివెన్ను), నేటి పత్రిక ప్రజావార్త :
న్యాయంగా, అవినీతికి తావులేకుండా, కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా,ఎంతో పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ స్పష్టం చేశారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గంలో ఎంతో ఉత్సాహంగా సాగుతోంది. రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ కృత్తివెన్ను మండల పరిధిలో శీతనపల్లి శివారు గ్రామం అడ్డపర్రు నుంచి ప్రారంభించారు.50 క్లస్టర్లు, 750 మంది ప్రజలున్న ఈ గ్రామంలో గురువారం మధ్యాహ్నం నుంచి పొద్దుపోయేవరకు ఇంటింటికి తిరుగుతూ విస్తృతంగా పర్యటించారు.
తొలుత ఆయన శీతనపల్లి శివారు అడ్డపర్రు గ్రామంలో పొనగంటి హనుమంతరావు, కూనసాని భారతీ లక్ష్మి, పొనగంటి కీర్తి కుమారి, కూనసాని నాగమణి, తమ్మినీడీ అశ్విని, తమ్మినీడీ నాగేంద్ర దేవి, కోరిపల్లి చంద్రశేఖర రావు, చిలుకూరి వెంకట్రావు, చిలుకూరి రామ సీత, మన్నే అనంతలక్ష్మి, చిలుకూరి ఝాన్సీ లక్ష్మి, మన్నే నగేష్, మన్నే మాధవి, తమ్మినీడీ కృష్ణకుమారి, తమ్మినీడీ రామలక్ష్మి తదితరుల గృహాలకు మంత్రి జోగి రమేష్ సందర్శించి గ్రామస్తులు అందర్నీ ఆప్యాయంగా పలకరించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను వారికి వివరించారు. ప్రజలు పొందిన లబ్ధి వివరాలతో కూడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంతకం చేసిన కరపత్రాలను వారికి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి జోగి రమేష్ ప్రజలతో మాట్లాడుతూ, గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడా ప్రజలకు స్పష్టంగా అర్ధమవుతుందన్నారు. ఏ ఒక్క చోట అవినీతికి ఆస్కారం లేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు కచ్చితంగా అమలవుతున్నాయన్నారు, సంక్షేమ క్యాలండర్ తో వివిధ పథకాలు అమలు చేస్తున్నామని ఇంటి గడప వద్దే సంక్షేమ పథకాలు అర్హులకు ఎటువంటి ఆటంకాలు లేకుండా అందుతున్నాయని మంత్రి జోగి రమేష్ చెప్పారు.బలహీనవర్గాల కుటుంబాలలో సమూల మార్పు తీసుకురావడానికే విద్యకు ఇంత పెద్దపీట వేస్తున్నారని.. ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతున్న మేలుని అన్ని వర్గాలకి తెలియ చెప్పేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమ ముఖ్య ఉద్దేశం అని మంత్రి జోగి రమేష్ అన్నారు. సంపూర్ణ అభివృద్ధి సాధించేందుకు జగన్‌ను అధికారంలో కొనసాగించడం పేద మధ్య తరగతి బలహీనవర్గాలకు అవసరమని మంత్రి అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో శీతనపల్లి గ్రామ సర్పంచ్ కూనసాని సునీత శ్రీనివాసరావు , కృత్తివెన్ను జడ్ పి టీ సీ సభ్యురాలు మైలా రత్న కుమారి, ఎంపీపీ కూనసాని గరుడ ప్రసాద్, మల్లేశ్వరం మార్కెట్ యార్డ్ చైర్మన్ కొల్లాటి బాలగంగాధర్, వైఎస్ఆర్సిపి మండల పార్టీ అధ్యక్షుడు వైదాని వెంకటరాజు, ఎంపీటీసీ కూనసాని మహాలక్ష్మి, కృత్తివెన్ను తహసిల్దార్ కోటేశ్వరరావు, ఎంపీడీవో పిచ్చిబాబు, వీఆర్వో నాగరాజు, పలువురు అధికారులు ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.