గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్, విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తీసుకునే ముందస్తు జాగ్రత్తలపై ఆపదమిత్ర కార్యక్రమం ద్వారా ఎన్ఎస్ఎస్, ఎన్ సిసి విద్యార్థులకు శిక్షణ అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత పేర్కొన్నారు. గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశం మందిరంలో గ్రామీణాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్, విపత్తుల నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ సర్టిఫికెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు, వరదలు, అగ్ని ప్రమాదాలు సంభవించిన సమయంలో ప్రథమ చికిత్సగా బాధితులకు సహాయంగా నిలిచేందుకు ఆపదమిత్ర ద్వారా శిక్షణ పొందటం అభినందనీయమన్నారు. శిక్షణలో భాగంగా జిల్లాలో ఎన్ఎస్ఎస్, ఎన్ సి సి విద్యార్థులతో పాటు వాలంటీర్లు ఆశా వర్కర్లు 12 రోజులు శిక్షణ అందించడం జరిగింది. తొలి దశలో 40మందికి శిక్షణ అందించామని నేడు వారికి శిక్షణ పొందిన వారికి దృపత్రాలతో పాటు కిట్లు అందిస్తున్నామన్నారు. ఎక్స్ టెన్షన్ ట్రైనింగ్ సెంటర్ సామర్లకోట ప్రిన్సిపల్ జే వేణుగోపాల్ మాట్లాడుతూ ఈనెల ఆరో తేదీ నుండి మరో 150 మందికి 17వ తేదీ వరకు శిక్షణను అందించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ వేణుగోపాల్, డిపిఎం జి కిరణమయి, శిక్షణ పొందిన లిఖిత గౌడ్,మున్నా, గణేష్, రోహిత్, కె. అనిల్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *