గ్రీనరీ అభివృద్ధి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ యందు వివేకానంద జంక్షను అభివృద్ధి చేయడమైనదని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో భాగముగా గ్రీనరీ అభివృద్ధి చేయడమైనదని తెలిపారు. జంక్షను ప్రాంతాన్ని మరియు గ్రీనరీ మెయింటినెన్సు కొరకు స్వచ్ఛంద సంస్థలు, తదితర ఆసక్తి గలవారు వాటి నిర్వహణ కోసం స్వచ్ఛందంగా ముందుకు వచ్చేందుకు ధరకాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. అందులో భాగంగా ఆసక్తి ఉన్న వారు నగరపాలక సంస్థకు ది.05-04-2023 నుండి (3) రోజుల లోగా ధరఖాస్తు చేయవలసినదిగా కోరడమైనది. ఇందులో సదరు జంక్షను యందు అభివృద్ధి చేసిన గ్రీనరీ. ఫుట్ పాత్, విగ్రహములు, పౌంటెన్లు స్వచ్ఛందముగా నిర్వహణ చేయవలసి ఉంటుందని తెలియచేశారు. చుట్టుప్రక్కల గ్రీనరీ మెయింటినెన్సు చేయవలసినచో కార్పొరేషన్ అనుమతిపై చేయవచ్చునని పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *