Breaking News

నగరంలో రోడ్ల మీద ఉన్న భవన నిర్మాణ వ్యర్ధాలను 3 రోజుల్లో తొలగించాలని, ముందస్తు సమాచారం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఇవ్వకుండా రోడ్ల మీద భవన నిర్మాణ వ్యర్ధాలను వేసిన వారి నుండి అపరాధ రుసుం వసూళ్లు చేయాలని పట్టణ ప్రణాళిక అధికారులను నగర కమిషనర్ కీర్తి చేకూరి ఆదేశించారు. శుక్రవారం క్యాంప్ కార్యాలయంలో పట్టణ ప్రణాలిక అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో భవన నిర్మాణ వ్యర్ధాలను నిర్మాణదారులు ఇష్టానుసారం రోడ్ల మీద వేస్తున్నారని, అటువంటి వారిని గుర్తించి వారి నుండి అపరాధ రుసుం వసూళ్లు చేసి, వ్యర్ధాలను తొలగించాలని సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులను ఆదేశించారు. అలాగే భవన నిర్మాణ సమయంలో తప్పనిసరిగా గ్రీన్ మ్యాట్ తో దుమ్ము రాకుండా కవర్ చేసుకోవలని యజమానులకు తెలియచేయాలన్నారు. ఇప్పటివరకు రీ సర్వే 76 శాతం జరిగిందని, వచ్చే వారానికి 85 శాతం జరగాలన్నారు. మే నెలాఖరు నాటికి మీడియా డివైజ్ ఫీజులు ఎరియర్స్, ప్రస్తుతం ఫీజులు నూరు శాతం వసూళ్లు జరగాలని, బకాయిలు చెల్లించిన ప్రకటనల బోర్డ్ ల తొలగింపు వెంటనే చేపట్టాలన్నారు. రోడ్ల విస్తరణ జరిగిన ప్రాంతాల్లో టిడిఆర్ బాండ్లు ఇచ్చేందుకు వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్ట్ కేసుల్లో కౌంటర్లు, అఫిడవిట్లు పక్కాగా నమోదు చేయాలని, కంటేమ్ట్ కాకుండా ప్రత్యెక శ్రద్ధ తీసుకోవాలని, కోర్ట్ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. కేసుల వారిగా ప్రతి వారం సిటి ప్లానర్ సమీక్ష చేయాలని ఆదేశించారు.సమావేశంలో సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, డిప్యూటీ సిటి ప్లానర్లు మూర్తి, కోటయ్య, ఏ.సి.పి.లు బాబురావు, అజయ్ కుమార్, అశోక్ కుమార్, సర్వేయర్లు సునీల్ కుమార్, హరి కృష్ణ, టి.పి.ఎస్.లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పవన్ కళ్యాణ్ చొరవ… శివయ్యకు నూతన ఆలయం…

-రూ. 55 లక్షల టీటీడీ నిధులతో వర్తనపల్లి శివాలయం పునర్నిర్మాణం -పాడేరు పర్యటనలో శివాలయాన్ని సందర్శించిన ఉప ముఖ్యమంత్రి -శిథిలావస్థకు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *