-ఘనీభవించిన రొయ్యల ప్రధాన సముద్ర ఎగుమతి ఉత్పత్తులు
-అమెరికా సంయుక్త రాష్ట్రాలు, చైనా, ఐరోపా సంఘము, సౌత్ ఈస్ట్ ఆసియా, జపాన్ మరియు మిడిల్ ఈస్ట్ ప్రధాన దిగుమతిదారులు
కొచ్చి, నేటి పత్రిక ప్రజావార్త :
భారీ అసమానతలు ఉన్నప్పటికీ 2022-23లో భారతదేశం రూ. 63,969.14 కోట్ల (అమెరికన్ డాలర్ 8.09 బిలియన్లు) విలువైన 17,35,286 MT సముద్ర ఆహారాన్ని రవాణా చేసింది. ఇది ఉత్పత్తి మరియు విలువ (అమెరికన్ డాలర్ మరియు రూపాయి రెండూ) పరంగా అన్ని సమయాలలో అత్యధిక ఎగుమతులు చేసింది. ఘనీభవించిన రొయ్యలు పరిమాణం, విలువ పరంగా ప్రధాన ఎగుమతి వస్తువుగా నిలిచింది. అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు చైనా భారతదేశ సముద్రపు ఆహార ప్రధాన దిగుమతి దారులుగా మారాయి.
2022-23 ఆర్ధిక సం. లో, 26.73% ఎగుమతి పరిమాణం పరంగా, 11.08% రూపాయి పరంగా, 4.31% అమెరికన్ డాలర్ పరంగా మెరుగుపడింది. 2021-22లో, భారతదేశం రూ. 57,586.48 కోట్ల (అమెరికన్ డాలర్ 7,759.58 మిలియన్లు) విలువైన 13,69,264 MT సముద్రపు ఆహారాన్ని ఎగుమతి చేసింది.
భారతదేశం, అమెరికా సంయుక్త రాష్ట్రాలు లాగా, తన ప్రధాన ఎగుమతి మార్కెట్లలో, అనేక సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, 17,35,286 MT సీఫుడ్ పరిమాణంతో అమెరికన్ డాలర్ 8.09 బిలియన్ల విలువైన ఎగుమతులను పూర్తి చేయగలిగింది అని సముద్ర ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి సంస్థ (ఎంపెడ) చైర్మన్ శ్రీ డి వి స్వామి, IAS చెప్పారు.
రూ. 43,135.58 కోట్లు (అమెరికన్ డాలర్ 5481.63 మిలియన్లు) ఆర్జించిన ఘనీభవించిన రొయ్యలు, సముద్ర ఆహార ఎగుమతుల బాస్కెట్ లో అత్యంత ముఖ్యమైన వస్తువుగా తన స్థానాన్ని నిలుపుకుంది, 40.98% పరిమాణంలో మరియు 67.72% మొత్తం డాలర్ ఆదాయంలో వాటాను కలిగి ఉంది. ఈ కాలంలో రొయ్యల ఎగుమతులు 1.01% రూపాయి విలువలో పెరిగాయి.
2022-23లో రొయ్యల మొత్తం ఎగుమతి 7,11,099 MT చేరుకొనగా. అమెరికా సంయుక్త రాష్ట్రాలు, అతిపెద్ద మార్కెట్, (2,75,662 MT) ఘనీభవించిన రొయ్యలను దిగుమతి చేసుకుంటుంది, చైనా (1,45,743 MT), యూరోపియన్ యూనియన్ (95,377 MT), సౌత్ ఈస్ట్ ఆసియా (65,466 MT), జపాన్ (40,975 MT), మరియు మిడిల్ ఈస్ట్ (31,647 MT) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
2022-23లో బ్లాక్ టైగర్ (BT) రొయ్యల ఎగుమతి వరుసగా 74.06%, 68.64% మరియు 55.41% పరిమాణం, రూపాయి విలువ మరియు అమెరికన్ డాలర్ పరంగా పెరిగింది. బ్లాక్ టైగర్ రొయ్యలు రూ. 2,564.71 కోట్లు (అమెరికన్ డాలర్ 321.23 మిలియన్లు) విలువైన 31,213 MTలకు ఎగుమతి చేయబడ్డాయి. 25.38% అమెరికన్ డాలర్ విలువ పరంగా బ్లాక్ టైగర్ రొయ్యలకు జపాన్ ప్రధాన మార్కెట్‌గా మారింది, యూరోపియన్ యూనియన్ (25.12%) మరియు USA (14.90%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వన్నామీ రొయ్యల ఎగుమతులు 2021-22తో పోలిస్తే 2022-23లో 5234.36 మిలియన్ల అమెరికన్ డాలర్ నుండి 4809.99 మిలియన్ల అమెరికన్ డాలర్ కు 8.11% క్షీణించాయి.
రెండో అతిపెద్ద సముద్ర ఉత్పత్తి అయిన ఘనీభవించిన చేప ఎగుమతి రూ. 5,503.18 కోట్ల తో(అమెరికన్ డాలర్ 687.05 మిలియన్లు), 21.24% పరిమాణంలో మరియు 8.49% అమెరికన్ డాలర్ ఆదాయం పొందింది. ఈ సంవత్సరం ఘనీభవించిన చేపల ఎగుమతి వరుసగా 62.65%, 58.51% మరియు 45.73% పరిమాణం, రూపాయి మరియు అమెరికన్ డాలర్ విలువ పరంగా పెరిగింది.
మూడవ అతిపెద్ద ఎగుమతి కింద, సురిమి రూ. 2,013.66 కోట్లు (అమెరికన్ డాలర్ 253.89 మిలియన్లు), ఘనీభవించిన ఆక్టోపస్ రూ. 725.71 కోట్లు (అమెరికన్ డాలర్ 91.74 మిలియన్లు), సురిమి సారూప్యం ఉత్పత్తులు రూ. 558.51 కోట్లు (అమెరికన్ డాలర్ 70.35 మిలియన్లు), క్యాన్డ్ ఉత్పత్తులు రూ. 326.48 కోట్లు (అమెరికన్ డాలర్ 41.56 మిలియన్లు), ఘనీభవించిన లోబ్స్టెర్ రూ.215.15 కోట్లు (అమెరికన్ డాలర్ 27 మిలియన్లు) మరియు ఇతర ఉత్పత్తులతో పాటు అమెరికన్ డాలర్ 658.84 మిలియన్ల విలువగలిగినది.
నాల్గవ అతిపెద్ద సముద్ర ఎగుమతి ఉత్పత్తి అయిన ఘనీభవించిన స్క్విడ్ రూ. 3593.75 కోట్లు (అమెరికన్ డాలర్ 454.61 మిలియన్లు) పొందింది, ఇది 4.83 శాతం పరిమాణంలో మరియు 5.62 శాతం డాలర్ ఆదాయంలో వాటాను కలిగి ఉంది. ఘనీభవించిన స్క్విడ్ ఎగుమతి 28.07% రూపాయి విలువలో మరియు 18.58% డాలర్ విలువలో పెరిగింది.
ఎండిన వస్తువుల ఎగుమతి, 2,52,918 MT చెరుకొనగా, 243.27% పరిమాణంలో మరియు 167.70% డాలర్ పరంగా విపరీతమైన వృద్ధిని చూపింది మరియు రూ. 3,080.92 కోట్లు (384.05 అమెరికన్ డాలర్ మిలియన్లు) ఆర్జించింది. ఈ సీఫుడ్ భాగం కింద, ఎండిన చేపలు మరియు రొయ్య కలిసి 307.96 మిలియన్ల అమెరికన్ డాలర్ మరియు ఎండిన చేపల మావ్ 24.88 మిలియన్లన అమెరికన్ డాలర్ అందించాయి.
కటిల్ ఫిష్ ఎగుమతి, 54,919 MT చెరుకొనగా, 14.09 % రూపాయి విలువలో మరియు 5.50 % అమెరికన్ డాలర్ విలువలో వృద్ధిని చూపి రూ. 2353.34 కోట్లు (295.49 అమెరికన్ డాలర్ మిలియన్లు) ఆర్జించింది.
ఆశాజనక రంగంగా పరిగణించబడే శీతలీకరించిన చేప/రొయ్య వస్తువుల ఎగుమతి కూడా 20.73 % అమెరికన్ డాలర్ పరంగా మరియు 12.63 % పరిమాణం పరంగా పెరిగింది.
బ్రతికిన చేప/రొయ్య ఎగుమతి, 7,824 MT చెరుకొనగా, 24.53% రూపాయిలో, 15.61% అమెరికన్ డాలర్ విలువలో వృద్ధిని చూపింది.
ఘనీభవించిన స్క్విడ్ (7.13%), ఘనీభవించిన కటిల్ ఫిష్ (13.33%), శీతల వస్తువులు (7.19%) మరియు బ్రతికిన సముద్ర ఉత్పత్తులు (3.90%) యూనిట్ విలువలలో పెరుగుదల గమనించబడింది.
విదేశీ మార్కెట్ల విషయానికొస్తే, విలువ పరంగా 2,632.08 మిలియన్ల అమెరికన్ డాలర్ విలువైన దిగుమతితో అమెరికా సంయుక్త రాష్ట్రాలు, భారత దేశం యొక్క ప్రధాన మత్స్య దిగుమతిదారుగా కొనసాగింది. 32.52 % అమెరికన్ డాలర్ విలువ పరంగా వాటాను కలిగి ఉంది. డిమాండ్ మందగించడంతో అమెరికా కు ఎగుమతులు అమెరికన్ డాలర్ పరంగా 21.94% తగ్గాయి. అమెరికన్ డాలర్ పరంగా 92.70% వాటాతో అమెరికా కు ఎగుమతి చేయబడిన ప్రధాన ఉత్పత్తులుగా ఘనీభవించిన రొయ్యలు కొనసాగాయి. అమెరికాకు బ్లాక్ టైగర్ రొయ్యల ఎగుమతులు పరిమాణం పరంగా 4.06% మరియు రూపాయి పరంగా 0.26% పెరిగాయి.
1,508.43 మిలియన్ డాలర్ల విలువైన 4,05,547 MT దిగుమతితో పరిమాణం మరియు అమెరికన్ డాలర్ పరంగా చైనా రెండవ అతిపెద్ద సముద్రపు ఆహార ఎగుమతి గమ్యస్థానంగా ఉద్భవించింది, 23.37% పరిమాణంలో వాటాను మరియు 18.64% డాలర్ పరంగా వాటాను కలిగి ఉంది. చైనా మార్కెట్‌కు 51.90% ఎగుమతులు పరిమాణంలో, 32.02% రూపాయి విలువలో మరియు 28.37% అమెరికన్ డాలర్ విలువ పెరిగాయి. చైనాకు ఎగుమతి చేసే ప్రధాన వస్తువు ఘనీభవించిన రొయ్యలు 35.94% పరిమాణంలో మరియు 60.92% డాలర్ విలువలో వాటాను కలిగి ఉండగా, ఘనీభవించిన చేప 34.88% పరిమాణంలో మరియు 18.56% అమెరికన్ డాలర్ విలువలో రెండవ అత్యధిక వాటాను కలిగి ఉంది. చైనాకు ఘనీభవించిన రొయ్యలు మరియు ఘనీభవించిన చేపలు పరిమాణం మరియు విలువ రెండింటి ద్వారా సానుకూల వృద్ధిని చూపించాయి.
1,263.71 మిలియన్ల అమెరికన్ డాలర్ విలువైన 2,07,976 MT దిగుమతితో యూరోపియన్ యూనియన్ మూడవ అతిపెద్ద గమ్యస్థానంగా కొనసాగింది. ఈ మార్కెట్‌లో, ఘనీభవించిన రొయ్యలు ఎగుమతుల యొక్క ప్రధాన వస్తువు, రూపాయి మరియు డాలర్ విలువలో వరుసగా 15.12% మరియు 7.20% పెరుగుదల నమోదు చేసింది. ఈ మార్కెట్‌లో యూనిట్ విలువ 3.77% వృద్ధిని చూపింది.
1191.25 మిలియన్ల అమెరికన్ డాలర్ విలువైన 4,31,774 MT దిగుమతితో సౌత్ ఈస్ట్ ఆసియా నాల్గవ అతిపెద్ద మార్కెట్. ప్రధాన ఎగుమతి వస్తువు అయిన ఘనీభవించిన రొయ్యల, పరిమాణంలో 15.16% వాటా మరియు అమెరికన్ డాలర్ విలువ ద్వారా 35.17%, 46.08% వృద్ధి చెందింది. ఘనీభవించిన చేప, ఎగుమతులలో రెండవ ప్రధాన అంశం, పరిమాణంలో 36.02% వాటా మరియు అమెరికన్ డాలర్ విలువ ద్వారా 20.57% , 46.84% వృద్ధి చెందింది.
జపాన్ 9.99 % వృద్ధితో, 6.29% పరిమాణంలో మరియు 5.99% అమెరికన్ డాలర్ విలువ పరంగా ఐదవ అతిపెద్ద దిగుమతిదారుగా కొనసాగింది. 71.35% ఘనీభవించిన రొయ్యల వాటాతో మరియు 5.26% అమెరికన్ డాలర్ వృద్ధితో జపాన్‌కు ఎగుమతులలో ప్రధాన వస్తువుగా కొనసాగింది.
భారతదేశం 330.68 మిలియన్ల అమెరికన్ డాలర్ విలువైన 77,677 MT ను మిడిల్ ఈస్ట్ కు ఎగుమతి చేసింది. ఈ మార్కెట్ 32.95% పరిమాణంలో, 17.33% రూపాయిలో మరియు 9.09% డాలర్ పరంగా వృద్ధిని చూపింది.