తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ భీమా క్లైమ్ కొరకు అవసరమయ్యే ధ్రువపత్రాలను సకాలంలో నిర్దేశిత గడువులోపు సంబంధిత భీమా సంస్థ కు అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కే వెంకట రమణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ వారి ఆధ్వర్యంలో వైఎస్సార్ భీమా క్లైమ్ లపై జిల్లా గ్రామ వార్డు సచివాలయం ఇంఛార్జి అధికారి సుశీల దేవి, డిఎల్డిఓ ఆది శేషారెడ్డి, డిసిహెచ్ఎస్ అధికారిణి మణి తదితర సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షిస్తూ మరణించిన వైయస్సార్ భీమా పాలసీదారుకు సంబంధించిన క్లైమ్ ధ్రువ పత్రాలు సకాలంలో నిర్దేశిత గడువులోగా గ్రామ వార్డు సచివాలయం సంక్షేమ సహాయకులు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని, డిఆర్డిఎ పర్యవేక్షణ చేయాలని సూచించారు. ప్రమాద బీమా క్లైమ్ కొరకు సమర్పించే ఎఫ్ఐఆర్, పోస్ట్ మార్టం రిపోర్ట్ తదితర నివేదికలు సకాలంలో నిర్దేశిత గడువులోపు సదరు భీమా సంస్థకు పూర్తి స్థాయిలో అందించేలా ఉండాలని తెలిపారు. భీమా సంస్థ చెల్లింపులు సకాలంలో జరగాలని తెలిపారు.
Tags tirupathi
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …