విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా నవరత్నాలు అమలు చేయడంతో పాటు హామీ ఇవ్వని ఎన్నో కొత్త పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిదే అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ కొనియాడారు. శనివారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా 12వ డివిజన్ 53వ సచివాలయం పరిధిలోని వెంకట గణేష్ స్ట్రీట్ నుండి మొదలై ఉమర్ ఫారూఖ్ స్ట్రీట్, నెహ్రు రోడ్డు, ట్రెజరీ ఎంప్లాయిస్ కాలనీ ప్రాంతాలలో ఇంటింటికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా వారి కుటుంబాలకు అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేసి ఈ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గురుంచి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత 10రోజుల నుండి ఈ డివిజన్ లో తిరుగుతుంటే ప్రజల నుండి విశేష స్పందన లభిస్తుంది అని ప్రభుత్వ జనరంజక పాలనకు ఇదే నిదర్శనమని సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే నివసించే డివిజన్ అయిన సరే అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి అభివృద్ధి చేయలేదని, నెహ్రూ గారు ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు వేసిన రోడ్లు, చేసిన అభివృద్ధి తరువాత మరలా నేడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత శంకుస్థాపన లు చేయడమే కాకుండా త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నారు అని కాలనీ వాసులు తమ ఆనందాన్ని పంచుకొంటున్నారని అవినాష్ తెలిపారు. ఈ ప్రాంతంలో ఉన్న ఖాళీగా ఉన్న పార్కు స్థలంలో 6కోట్ల రూపాయలు వెచ్చించి సబ్ స్టేషన్ నిర్మించడం జరిగింది అని అన్నారు.ఈ కార్యక్రమంలో 12వ డివిజన్ ఇంచార్జ్ మాగంటి నవీన్,డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ,వైస్సార్సీపీ నాయకులు శిఖకొల్లి సుబ్బారావు, దనేకులు ఇందిరా ప్రియదర్శిని, అబ్దుల్ మహమ్మద్ రహీం, బర్కతుల్లా బేగ్, షేక్ షకీల్, అరిగెళ్ళ అరుణ, దేవి ప్రియదర్శిని, సూరపనేని సరోజినీ, చలం శెట్టి రాజు, తుమ్మల రమేష్ పాల్గొన్నారు.
Tags vijayawda
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …