Breaking News

పవన్ కళ్యాణ్ తో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ

హైదరాబాద్ , నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్  గారెత్ విన్ ఓవెన్  మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. శుక్రవారం  హైదరాబాద్ లోని  పవన్ కళ్యాణ్ నివాసానికి ఆయన వెళ్లారు. పవన్ కళ్యాణ్ సాదర స్వాగతం పలికారు. ఈ సమావేశంలో వర్తమాన సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ పొలిటికల్ ఎకానమీ సలహాదారు నళిని రఘురామన్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

పోస్టర్ ఫ్రీ సిటికి ప్రతి ఒక్కరి సహకారం, భాగస్వామ్యం అవసరం

-లక్షల ఖర్చుతో చేస్తున్ననగర సుందరీకరణకు పోస్టర్స్ తో చేటు -పోస్టర్స్ తొలగింపుకు ప్రత్యేక కార్యాచరణ -నిబందనలు ఉల్లంఘించిన వారిపై భారీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *