Breaking News

అంతర్జాతీయ వయో వృద్ధు ల దినోత్సవం సందర్బంగా వృద్దులకు సత్కారం

– సీనియర్ సిటిజన్స్, సీనియర్ ఓటర్ల ను సత్కరించిన కలెక్టర్
-యువత ఓటు హక్కు విలువ తెలుసుకోవాలి..
-జిల్లా లో 18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరు తప్పక ఓటు హక్కు కలిగి ఉండాలి
-ఓటు హక్కును పారదర్శకముగా వినియోగించు కోవాలి.
-103 సంవత్సరాలు నిండిన దాట్ల పద్మావతి, 85 సంవత్స రాలు నిండిన 14 మంది వయోవృద్దులను ఎక్కువ సార్లు ఓటు హ క్కు వినియోగించు కోవడం అభినందనీయం
– కలెక్టర్ డా. కె. మాధవిలత

చాగల్లు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 100 సంవత్సరాలు, 85 ఏళ్లు పైబడిన ఓటర్ల గుర్తించి సన్మానించడం ద్వారా ఓటుహక్కు వినియోగం పై ప్రజల్లో, యువతలో చైతన్యం తీసుకుని రావడానికి ఈ కార్యక్రమం చక్కటి వేదికగా నిలిచిందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవిలత అన్నారు.ఆదివారం చాగల్లు పంచాయతీ కార్యాలయం వద్ద అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవం వయో వృద్ధులను సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ డా కే మాధవీలత మాట్లాడుతూ, నియోజక వర్గంలో 103 సంవత్సరాలు నిండిన దాట్ల పద్మావతి, మరో 85 సంవత్స రాలు నిండిన 14 మంది వృద్దులను గుర్తించి సన్మానించు కోవడం జరిగిందన్నారు. ఎక్కువ సార్లు వారి ఓటు హక్కును వినియోగించు కొన్నందుకు గుర్తింపుగా 15 మంది వృద్ధులను సత్కరించు కోవడం జరిగిందన్నారు. ఇటువంటి సన్మాన కార్యక్రమం లో భాగస్వామ్యం అవ్వడం మంచి అనుభూతని ఇచ్చిందన్నారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండిన యువతి, యువకులు ఇటువంటి వారి నుంచి తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలన్నారు. జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండే అర్హు లైన ఓటర్లందరినీ గుర్తించేందు కు ఎన్నికల సంఘం నియోజక వర్గంలో సర్వే నిర్వహించా మన్నారు . అర్హులైన ఓటర్లు ఓటు హక్కు పొందడమే కాకుండా తప్పని సరిగా వినియోగించు కొని ఓటు హక్కు శాతాన్ని పెంచే విధంగా కృషి చేయాలని హితవు పలికారు.ఈ కార్యక్రమంలో కొవ్వూరు ఆర్డీఓ ఎస్. మల్లిబాబు, తహిసిల్దార్ కే రాజ్యలక్ష్మి, ఎంపీడీవో బి రాంప్రసాద్, రెవిన్యూ సిబ్బంది, సీనియర్ సిటిజన్స్, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Check Also

విఘ్నేశునికి మల్లాది విష్ణు ప్రత్యేక పూజలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : వినాయక చవితి ఉత్సవాలు నియోజకవర్గంలో వైభవంగా సాగుతున్నాయి. వివిధ మండపాల్లో విభిన్న రూపాల్లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *