Breaking News

నైతిక విలువలు అవసరం

– సుజాత చంద్ర
-సంసిధ్ ఇంటర్నేషనల్ స్కూలు లో ఘనంగా వేడుకులు

విశాఖపట్టణం, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ప్రతి ఒక్కరూ నైతిక విలువలకు కట్టుబడి ఉన్నప్పుడే ప్రపంచ శాంతి సౌభాగ్యం విలసిల్లుతుందని సన్ రైజ్ కిడ్స్ ప్రీ స్కూల్ డైరక్టర్ జి సుజాత చంద్ర అన్నారు. గాజువాక లోని సంసిధ్ (SAMSIDH) ఇంటర్నేషనల్ స్కూల్ లో శనివారం రాత్రి ప్రపంచ విలువల దినోత్సవం ఘనంగా జరిగింది. స్కూల్ చైర్మన్ శ్రీ వాస శ్రీనివాసరావు, డైరక్టర్ శ్రీమతి వాస మాధవి, ప్రిన్సిపాల్ శ్రీమతి జి.భారతి ప్రసంగించారు. సభానంతరం విద్యార్థిని విద్యార్థులచే పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. (సీనియర్ జర్నలిస్ట్ నిమ్మరాజు చలపతిరావు మనుమరాలు) ఐదవ తరగతి విద్యార్థిని వేదుల కృత్తిక తో కూడిన బృందం పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకత పై ప్రదర్శించిన నృత్యం అలరించింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ

– ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *