Breaking News

15 వ జాతీయ ఓటరు దినోత్సవ శుభాకాంక్షలు

-ఎన్నికల సిబ్బంది, బి ఎల్ ఓ లకు ప్రోత్సాహక అవార్డు ప్రధానం
-ఆకట్టుకున్న ఓటరు చైతన్య సాంస్కృతిక కార్యక్రమాలు, నాటిక
-మన భవిష్యత్ ను, తలరాత మార్చే ఒకే ఒక్క ఆయుధం ఓటు
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటు హక్కు మనకు రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం, ప్రతి ఒక్కరూ అమూల్యమైన ఓటు హక్కు ను తప్పనసరిగా వేసి, తమను పరిపాలించే ప్రభుత్వాన్ని ఎన్నుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాధవీ లత విజ్ఞప్తి చేశారు. గురువారం ఆనం కళా కేంద్రంలో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా సాంస్కృతిక , అవార్డ్ ప్రధానోత్సవ , విద్యార్థులకు బహుమతుల ప్రాధానోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని, జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , రిపబ్లిక్ దినోత్సవం ఎంత వేడుకగా జరుపు కుంటామో, అంతే వేడుకగా ఓటరు దినోత్సవం జరుపుకోవాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ , రిపబ్లిక్ దినోత్సవం ఎంత వేడుకగా జరుపుకుంటామో, అంతే వేడుకగా ఓటరు దినోత్సవం జరుపుకోవాలని పేర్కొన్నారు. హక్కుల కోసం అడిగే అవకాశం ఓటు హక్కు వినియోగించు కునే వారికే ఉంటుందని , ఓటు వేయడానికి నిర్లక్ష్యం వహించవద్దని కోరారు. లాలా చెరువు స్కూల్ విద్యార్థులు గ్రామీణ, పట్టణ ప్రాంతాల ఓటర్లు ఓటు వేయడం లో నిర్లిప్తత ప్రదర్శించే విధానం కళ్ళకు కట్టినట్లు చూపించారని మెచ్చుకున్నారు. పిల్లలు వారి తల్లితండ్రులు, చుట్టుపక్కల వాళ్ళు ఓటు వేసేలా చూడాలని, మనల్ని 5 ఏళ్లు పాటు పాలించే వారిని ఎన్నుకునే అవకాశం మనకు ఉందని తెలిపారు. ప్రజా స్వామ్య వ్యవస్థ లో ఓటు ఒక వజ్రాయుధం అని పేర్కొన్నారు. మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం మంచి ప్రభుత్వాలను ఎన్నుకోవడం ముఖ్యం అన్నారు. మనకు ఓటు హక్కు కల్పించడం కోసం లక్షలాది ఉద్యోగులు సిబ్బంది కలెక్టర్ నుంచి గ్రామ స్థాయి వరకు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఓటు మన సామాజిక బాధ్యతన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ స్ఫూర్తి తో నేడు సామాజిక న్యాయ సమతా ర్యాలీని జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం అంబేడ్కర్ కి ఘనమైన నివాళి గా పేర్కొన్నారు. మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ , మనకు బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండడం వల్ల మిగతా అన్ని ప్రజాస్వామ్య దేశాల కంటే ఎక్కువ అభివృద్ధి చెందడం జరిగిందన్నారు. పారదర్శకంగా, ఖచ్చితత్వం తో ఓటరు నమోదు, పొలింగ్ ప్రక్రియ చేపట్టడం ఒక ప్రధాన కారణం అని పేర్కొన్నారు. ఓటు హక్కు, దాని యొక్క ప్రాధాన్యత ను ప్రతి ఒక్క పౌరుడు తప్పని సరిగా తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఓటు హక్కు కలిగిన ఉన్నా వారు ఓటు వేయడం, ఓటు హక్కు కోసం అర్హత కలిగిన వారు ఓటరు గా నమోదు కావడం చాలా ముఖ్యం అన్నారు. ఇందు కోసం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఆధ్వర్యంలో గత 9 నెలలుగా ఎంతో పని చెయ్యడం జరిగిందన్నారు. ఇందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నట్లు పేర్కొన్నా. నగరపాలక సంస్థ పరిధిలో సుమారు 96 వేల దరఖాస్తులు పరిష్కారం చెయ్యడమే తార్కాణం అన్నారు. ఓటు మన హక్కు, తప్పకుండా ఎన్నికల్లో ఓటు వేద్దాం అని దినేష్ కుమార్ తెలియ చేశారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు, అదనపు ఎస్పీ జి. వేంకటేశ్వర రావు , జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహం, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎస్ జ్యోతి, అదనపు కమిషనర్ పి ఎం. సత్య వేణి, డి ఐ ఓ జేవీఎల్ సుబ్రమణ్యం , జిల్లా సంక్షేమ అధికారి ఎం. సునీల్, వివిధ స్కూల్స్ విద్యార్ధులు, అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వివిధ స్కూల్స్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం ఎన్నికల సిబ్బందికి బి ఎల్ ఓ లకు అవార్డులు , వ్యాసరచన, వకృత్వ, డ్రాయింగ్ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *