రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ ఓటరు దినోత్సవ స్ఫూర్తి తో ప్రతి ఒక్క అర్హత కలిగిన వారు ఓటరు గా నమోదు కావడం తో పాటు వారు తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించు కోవాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి కే. మాధవీ లత పిలుపు నిచ్చారు. గురువారం స్థానిక వై జంక్షన్ నుంచి ఆనం కళా కేంద్రం వరకు జాతీయ ఓటర్ దినోత్సవ ర్యాలీ, అంబేడ్కర్ స్ఫూర్తి తో సామాజిక సమతా సంకల్పం ర్యాలీ ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, జనవరి 22 న ఓటరు జాబితా ప్రకటించడం జరిగిందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో ఓటు హక్కు కలిగిన వారు, నమోదు చేసుకున్న వారు వారి ఓటు హక్కు ఉందో లేదో సరి చూసుకోవాలి అని పేర్కొన్నారు. మీ సమీపంలో వున్న బి ఎల్ వో వద్ద, తహశీల్దార్ కార్యాలయం వద్ద ఓటరు జాబితా అందుబాటు లో ఉంచడం జరిగిందన్నారు. ఓటరుగా ఇప్పటికి నమోదు కాకపోతే ఫారం 6 ద్వారా ఓటరు గా నమోదుకు అవకాశం ఉందని పేర్కొన్నారు. 18 ఏళ్లు నిండిన వారు, ఏప్రిల్ 1 వ తేది నాటికి 18 ఏళ్లు పూర్తి అయ్యే వాళ్ళు ముందస్తుగా ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల కమిషన్ అవకాశం కల్పించిందని, 18 ఏళ్లు నిండిన వాళ్ళు, ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు దాటిన వాళ్ళు తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని విజ్ఞప్తి చేశారు. మార్పులు చేర్పులు కోసం ఫారం 8, తొలగింపు కోసం ఫారం 7 ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ మాధవీలత పేర్కొన్నారు. ఓటు హక్కు అనేది మన రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం అని, ఓటు వేసే రోజు కాకుండా ముందుగానే మీకు ఓటు ఉందో లేదో సరి చూసుకునే బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. ఓటరు నమోదు అనేది నిరంతర ప్రక్రియ అన్నారు. ఈ విషయంలో కొంత అవగాహన లేని కారణంగా కొందరు ఓటరు గా నమోదు ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకొవడం కోసం ఇటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో ఇంత ఉత్సాహంగా పాల్గొన్న ప్రతి ఒక్కరూ స్ఫూర్తి ఇవ్వడం తో పాటు వారి ఇంటిలో ఉండే ప్రతి ఒక్క ఓటరు ఓటు హక్కు వేసేలా చూడాలని పిలుపు నిచ్చారు. అంతకు ముందు సెల్ఫి పాయింట్ వద్ద విద్యార్థుల తో కలిసి కలెక్టర్ మాధవీలత, మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ ఫోటోలు దిగారు. పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొనడం పై కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ర్యాలీలో మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి జీ. నరసింహులు, జిల్లా విద్యా అధికారి ఎస్. అబ్రహం, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కే ఎస్ జ్యోతి, వివిధ స్కూల్స్ విద్యార్ధులు, అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News