Breaking News

దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఎన్నికలు నిర్వహిస్తాం…

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
2024 సార్వత్రిక ఎన్నికలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. దివ్యాంగులు అందరికీ ఓటు హక్కు ఉండాలి, వారు సానుకూల వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని వసతులు ఉండాలి అనే నినాదంతో ఎన్నికల కమిషన్ పని చేస్తోందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్దా ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. ‘హోమ్ ఓటింగ్’ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు కోరితే ఇంటివద్దే ఓటు నమోదు చేసే అవకాశం కల్పిస్తామన్నారు. ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకోవాలనుకునే వికలాంగులు బీఎల్ఓ ద్వారా ఆర్వోకు ఫార్మ్ 12 డి సమర్పించాల్సి ఉంటుందన్నారు.

ఎక్కువ మంది వికలాంగులు ఉన్న పోలింగ్ స్టేషన్లలో రెడ్ క్రాస్, ఎన్.ఎస్.ఎస్, ఎన్సీసీ వంటి సంస్థల నుంచి ఎంపిక చేసిన వ్యక్తులను వాలంటీర్లుగా నియమించి ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవసరమైన సహాయం అందిస్తామన్నారు. దివ్యాంగ ఉద్యోగులు, నిండు గర్భిణీ/బాలింత ఉద్యోగులకు ఎన్నికల విధులనుంచి మినహాయింపు ఇవ్వనున్నామన్నారు. అందుకు తగ్గట్టుగానే ఉద్యోగుల సమాచారం ఇవ్వాలని అన్ని శాఖలను కోరామన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా మంగళవారం ఉదయం రాష్ట్ర సచివాలయంలో ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు’ రాష్ట్ర స్థాయి స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో గత ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకోవడంలో దివ్యాంగులు ఎదుర్కున్న సమస్యలు, వాటికి పరిష్కారాలను సూచించాలని దివ్యాంగ సంఘాల ప్రతినిథులను కోరారు. వారి అభ్యర్థన మేరకు జిల్లా స్థాయి, నియోజక వర్గ స్థాయి ‘అందరికీ అందుబాటులో ఎన్నికలు ‘ కమిటీలలో దివ్యాంగ సంస్థలు, ప్రతినిథులను భాగస్వామ్యం చేసే విధంగా ఆదేశాలు జారీ చేస్తామన్నారు. నిబంధనల మేరకు వారి సూచనలు అమలు చేసే అవకాశం పరిశీలిస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు ప్రధాన ఎన్నికల అధికారి ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్, కమిటీ నోడల్ ఆఫీసర్ మల్లిబాబు, రాష్ట్ర అంధ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు రవీంద్ర బాబు, రాష్ట్ర బధిర సంఘం జెనరల్ సెక్రెటరీ శశి కుమార్, రోడ్లు భవనాల శాఖ అడిషనల్ సెక్రెటరీ బి.నరసింహా రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ సెక్రెటరీ మురళి కృష్ణ, స్త్రీ,శిశు, దివ్యాంగ & వయోవృద్ధుల శాఖ అసిస్టెంట్ సెక్రెటరీ విజయలక్ష్మి, పాఠశాల విద్య అడిషనల్ సెక్రెటరీ ఎం.భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *