Breaking News

తెర్లిస్‌ క్లినిక్‌లో ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రామవరప్పాడు యాదవ బజార్‌లో తెర్లిస్‌ క్లినిక్‌లో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. క్లినిక్‌ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గుండె వైద్య నిపుణులు డాక్టర్‌ తెర్లి సురేష్‌ (ఎంస్‌ సర్జన్‌), ఊపిరితిత్తుల వైద్య నిపుణురాలు డాక్టర్‌ భానురేఖ తెర్లి ఎండీ ఆధ్వర్యంలో ఆదివారం వైద్య శిబిరం నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన వైద్య శిబిరం సాయంత్రం వరకు కొనసాగింది. రెండు దశాబ్దాలకు పైగా వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్‌ సురేష్‌, భానురేఖలు మాట్లాడుతూ, కార్పొరేట్‌ వైద్యం అందని సామాన్య, మధ్యతరగతి ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న ధ్యేయంతో తెర్లిస్‌ క్లినిక్‌ను ఏర్పాటు చేశామన్నారు. కరోనా తర్వాత గుండె, ఊపిరితిత్తులకు సంబంధించి వ్యాధులు మనిషిపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయని, వీటితో బాధపడేవారి సంఖ్య ఎక్కువగా ఉందని అన్నారు. ఇటువంటి వారిని గుర్తించేందుకు కృష్ణాజిల్లా వ్యాప్తంగా అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించామన్నారు. ఆదివారం ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో బీపీ, షుగర్‌, గుండెకు సంబంధించిన పరీక్షలు, ఈసీజీ, 2డి ఈకో, కొలెస్ట్రాల్‌, ఊపిరితిత్తులకు సంబంధిన పరీక్షలు ఉచితంగా నిర్వహించామన్నారు. సాయంత్రం వరకు సాగిన వైద్య శిబిరంలో సుమారు 400 మంది వరకు వైద్య సేవలు పొందారన్నారు. ప్రస్తుతం మనిషిని అనుక్షణం భయపెడుతున్న గుండె, ఊపిరితిత్తులకు సంబంధించి కార్పొరేట్‌ స్థాయిలో వైద్యం అతితక్కువ ఖర్చుతో అందించేందుకు తెర్లిస్‌ క్లినిక్‌ ఎప్పుడు పేదలకు అందుబాటులో ఉంటుందని డాక్టర్‌ సురేష్‌, భానురేఖలు తెలిపారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *