Breaking News

ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తాం…

-పద్మాకర్‌ ఐజాక్‌, ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ, మన రామరాజ్యం పార్టీ, జనతా కాంగ్రెస్‌ పార్టీ, ప్రజా సోషలిస్టు కూటమి, యుఎస్‌ఎస్‌ఎ థర్డ్‌ ఫ్రంట్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా బుధవారం నగరంలోని ఐపిసి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ & మన రామ రాజ్యం పార్టీలు కలసి ప్రజా సోషలిస్ట్‌ కూటమి & థర్డ్‌ ఫ్రంట్‌ వారి సౌజన్యంతో ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షులు కె.బి.శ్రీధర్‌, మన రామ రాజ్యం పార్టీ జాతీయ అధ్యక్షులు మావులేటి దినేష్‌లు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో 175 అసెంబ్లీ స్థానాలు మరియు 25 పార్లమెంట్‌ స్థానాల నుంచి కూటమి తరపున అభ్యర్థులు ఎన్నికలలో పోటీ చేస్తారని విజయవాడలో ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ ఆఫీస్‌నందు కూటమి అభ్యర్థులను నామని భాస్కరు నేత, అంజనీదేవి. గోగిరెడ్డి త్వరలోనే ప్రకటిస్తారన్నారు. త్వరలో ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాలలో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని త్వరలోనే ఉమ్మడి మేనిఫెస్టో ప్రగటిస్తామని ఇండియన్‌ ప్రజా కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పద్మాకర్‌ ఐజాక్‌ తెలిపారు, ఈ సందర్భంగా పద్మాకర్‌ వైజాగ్‌ మాట్లాడుతూ త్వరలోనే ఐపిసి పార్టీ వెబ్‌సైట్‌ మరియు మన రామరాజ్యం పార్టీ వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చేస్తున్నామని తెలిపారు. ఎపి అధ్యక్షులు మహేష్‌, ఎపి అబ్జర్వర్‌ అంజనీదేవి. గోగిరెడ్డి. ఎపి కో`ఆర్డినేటర్‌ నామని. భాస్కర్‌ నేత మాట్లాడుతూ బావ సారూప్యం గల పార్టీలతో కలిసి పోటీ చేస్తామని తెలిపారు. ఎపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జయబాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి మా ఫ్రంట్‌ కూటమితోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో యుఎస్‌ఎస్‌ఎ థర్డ్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షులు దేవరపల్లి మహేష్‌, జనతా కాంగ్రెస్‌ పార్టీ నాయకురాలు పావని, జాతీయ కార్యదర్శి కట్టా రమేష్‌, బాలాజీ, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *