తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలో ఓటు హక్కున్న వారందరూ ఓటు వేస్తేనే ప్రజాస్వామ్యాన్ని ని కాపాడిన వారమౌతామని తెనాలి సబ్ కలెక్టర్ ప్రఖార్ జైన్(IAS) అన్నారు. ఆదివారం సాయంత్రం తెనాలిలోని కవి రాజా పార్క్‌లోని సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌లో SVEEP కార్యక్రమంలో సబ్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ ఆఫీసర్ తెనాలి పాల్గొని సీనియర్ ఓటర్లతో సంభాషించి మీరు ఓటు వేసి అందరితో ఓటు వేయించాలని కోరారు, ఈ కార్యక్రమంలో తెనాలి తహసిల్దారు శ్రీనివాసరెడ్డి కమిషనరు బండి శేషన్న సీనియర్ సిటిజన్ నాయకుల మొవ్వా సత్యన్నారయణ పాల్గొన్నారు. పై అవగాహన కార్యక్రమంలో 100మంది పైగా సీనియర్లు హాజరైనారు.
Prajavartha Online Telugu News