-సంభందిత నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి పోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక తేదీలను ఖరారు చేయటం జరుగుతుంది
-ఆయా తేదీల్లో ఏ వి ఈ ఏస్ (అబ్సెంటి ఓటర్ అత్యవసర సేవలు ) ఓటర్లు ప్రత్యక్షంగా పాల్గొని ఓటు వేయాల్సి ఉంటుంది
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోస్టల్ బ్యాలెట్ ను ఎన్నికల సమయంలో అత్యవరస విధుల్లో బాధ్యతలు నిర్వహించే వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనీ, ఆమేరకు సంభందిత ఫార్మెట్ లో వివరాలు రెండు రోజుల్లో అందచేయాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో జిల్లా పరిథిలో ఉండే అత్యవసర సేవలు నిర్వహించే అధికారులకి, శాఖల అధికారుల ప్రతినిధులకు పోస్టల్ బ్యాలెట్ పై అవగాహన కల్పించడం జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, కేంద్ర ఎన్నికల కమిషన్ దేశ వ్యాప్తంగా 33 శాఖలకు చెందిన అత్యవసర సేవలు అందించే ఉద్యోగులకు, తదితరులకి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును కల్పించడం జరుగుతోందనీ అన్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఓటు వేయాలన్నదే ఎన్నికల సంఘం యొక్క సంకల్పం అని పేర్కొన్నారు. ఆమేరకు సంబంధిత అధికారులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కును వినియోగించు కోవడానికి ఫారం 12 డి ద్వారా అంగీకారం తెలియ చెయ్యాల్సి ఉంటుందన్నారు. అందులో భాగంగానే నిర్ణీత ప్రోఫా ర్మాలో శుక్రవారం సాయంత్రం కి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఎన్నికల ప్రక్రియ సమయంలో అత్యవసర సేవలు అందించే క్రమంలో విధుల్లో ఉండే వారిని మాత్రమే అధికారులు గుర్తించి వివరాలు అందచెయ్యలన్నారు. అటువంటి వ్యక్తులు వారికీ ఓటు హక్కు కలిగిన నియోజక వర్గానికి నిర్దేశించిన రోజుల్లో వెళ్ళి ప్రత్యక్షంగా పోస్టల్ బ్యాలెట్ ఓటు వేయాల్సి ఉంటుందన్నారు. కేవలం అత్యవసర సేవలు అందించే వాటిలో ఉన్న కారణంగా ఆయా శాఖల అధికారులు పోస్టల్ బ్యాలెట్ కోసం సిబ్బందిని సిఫార్సు చెయ్యకుండా, జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.
ఇటీవల కాలంలో బదలీపై వచ్చిన అధికారులు, ఉద్యోగులు వెంటనే స్థానికంగా పనిచేస్తున్న చోటుకి ఓటు బదలీనీ ఫారం 8 లో చేసుకొవాలని కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. పోస్టల్ బ్యాలెట్ కి సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని నోడల్ అధికారి, జిల్లా హౌసింగ్ అధికారి ముత్యాల శ్రీనివాస్ ద్వారా నేరుగా పొంద వచ్చునని కలెక్టర్ తెలియ చేశారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్వో జీ. నరసింహులు, హౌసింగ్ పీడీ ఎమ్.శ్రీనివాస్, డి సి వో ఆర్.శ్రీనివాస్ నాయుడు, ఇతర సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.