Breaking News

ఆర్టీసీ విలినంతరం సమస్యలు పరిష్కరానికి కార్యచరణ

-సిబ్బంది మరియు సంస్థ నిర్వహణలో ఉన్న విధివిధానాలపై రవాణా శాఖ మంత్రి సమీక్ష
-ఏపీఎస్ఆర్టీసీపై రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమీక్ష
-అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని ఆదేశాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
గత ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తరువాత నుండి అనేక సమస్యలు వెంటాడుతున్నాయని, విలినంతరం సమస్యలు పరిష్కరానికి కార్యచరణ చేయాలని, సిబ్బంది, సంస్థ నిర్వహణలో సరైన విధివిధానాలు అవలంబించాలని, అవసరాలకు అనుగుణంగా నూతన బస్సులు కొనుగోలు చేయాలని, ఆర్టీసీపై రుణభారం తగ్గింపునకు ప్రయత్నాలు దిశగా కార్యాచరణ రూపొందించాలని, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచన చేసారు. మంగళవారం సచివాలయంలోని మంత్రి కార్యాలయం లో అయన ఆర్టీసీ అధికారులతో సమీక్షా నిర్వహించారు. టికెట్ (కోర్) రాబడి మరియు నాన్-టికెట్ (నాన్-కోర్) ఆదాయాన్ని మెరుగుపరచడానికి చర్యలు తీసుకోనున్నట్లు, ఆదాయాన్ని పెంచుకోవడానికి BOT మరియు ఇతర వాణిజ్య ప్రాజెక్టుల కోసం ఉపయోగించాల్సిన భూముల వివరాలపైన, అదేవిధంగా BOT/ ఇతర ప్రాజెక్ట్‌లకు సంబదించిన అంశాలపై ప్రజా ప్రతినిధుల నుండి స్వీకరించబడిన వాణిజ్య ప్రతిపాదనలు/అభివృద్ధి పనుల వివరాలు మరియు వాటికి సంబందించిన ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళికల పైన పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు / సంబంధిత ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళిక, స్క్రాపింగ్ కోసం వర్గీకరించబడిన పాత బస్సులను వేలం చేసే విధానంలోని నిబంధనలు సంబంధిత కొత్త విధానల అమలుపై , అద్దె బస్సుల ఆదాయం మెరుగుపరచడానికి ప్రతిపాదిత కార్యాచరణ ప్రణాళిక పై . రిప్లేస్ చేయాల్సిన హైర్ బస్సుల వివరాలు, సర్వీసుల పెంపుదల మరియు కొత్త అద్దె బస్సులు ప్రవేశ పెట్టాలని, ఉద్యోగులు సమస్యలను అసోసియేషన్ల ద్వారా పరిష్కార అంశాలపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాంతిలాల్ దండే, ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఫైనాన్షియల్ అడ్వైజర్ పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

మైనారిటీ యువతకు విద్య, ఉద్యోగాల్లో స్వర్ణావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం

-వడ్డేశ్వరంలో సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్‌మెంట్ ఆఫ్ మైనారిటీస్ (CEDM) నూతన కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్.ఎమ్.డి. ఫరూక్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *