Breaking News

‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ కార్యాచరణలో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యం

-ఎంఎస్ఎంఈలుగా స్వయం సహాయక సంఘాలు:- ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
‘వన్ ఫ్యామిలీ-వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్ధికంగా పురోగతి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెర్ప్, మెప్మా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని ఎస్‌హెచ్‌జీలను వాటి ఆదాయ ఆర్జన బట్టి ఐదు కేటగిరీలుగా విభజించాలని సూచించారు. ఏడాదికి రూ. లక్ష కన్నా తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును ‘నాన్ లాక్‌పతి’గా, రూ. లక్ష నుంచి రూ. 10 లక్షలు వరకు ‘లాక్‌పతి’, రూ. 10 లక్షలు పైన సంపాదిస్తే ‘మైక్రో’, రూ.50 లక్షలు కన్నా అధికంగా ఆదాయం వస్తే ‘స్మాల్’, రూ. కోటి కన్నా ఎక్కువ ఆర్జిస్తే ‘మీడియం’ కేటగిరీలుగా విభజించాలన్నారు. అలాగే వ్యవసాయం, పరిశ్రమలు, సేవారంగం వారీగా ఆదాయ వివరాలు ఉండాలన్నారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సెర్ప్, మెప్మా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

లక్ష ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు లక్ష్యం :-
స్వయం సహాయక సంఘాలను ఎంఎస్‌ఎంఈలుగా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద అందించే ప్రోత్సాహకాలతో ఆయా సంఘాలకు లబ్ది చేకూరుతుందని ముఖ్యమంత్రి అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో కనీసం లక్ష ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్లు అయినా చేయాలన్నారు. డ్రోన్ దీదీ పథకాన్ని స్వయం సహాయక సంఘాలు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుని ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా స్వయం సహాయక బృంద సభ్యులకు శిక్షణ అందించాలని చెప్పారు. ఎస్‌హెచ్‌జీ సభ్యుల తలసరి ఆదాయం రాష్ట్ర తలసరి ఆదాయం కన్నా చాలా తక్కువ ఉందని, దీనిపై దృష్టి పెట్టి వారి ఆదాయమార్గాలు మెరుగు పరిచేలా ఆలోచన చేయాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్లేస్ మీరు చెప్పినా… నన్ను చెప్పమన్నా.. …కూటమి అభివృద్ధిపై చర్చకు రెడీ

-వైసీపీకి మంత్రి సవిత సవాల్ -మీటరు రోడ్డు కూడా వేయలేని అసమర్థులు -వైసీపీ నేతలపై మంత్రి సవిత విసుర్లు -ఉన్న …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *