Breaking News

సౌదీలో చిక్కుకున్న యువతను స్వదేశానికి తీసుకొస్తాం – మంత్రి కొండపల్లి శ్రీనివాస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది యువకులు సౌదీ అరేబియాలో చిక్కుకున్నారు. ఏజెంట్ల ద్వారా మోసపోయిన జిల్లా యువకులను తిరిగి సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నాం. ఏ పీ ఎన్ ఆర్ టి విభాగం ద్వారా సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయంతో ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నాం. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో స్థానిక జిల్లా కలెక్టరును అప్రమత్తం చేశాం. జిల్లా కలెక్టరును విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో ఈ విషయంపై సంప్రదింపులు జరపాల్సిందిగా ఆదేశాలు ఇచ్చాం. బాధితుల బందువులు ఆందోళన చెందవద్దని వారిని త్వరగా ఇంటికి తీసుకొస్తామని హామీ ఇస్తున్నాం. మా కార్యాలయం ద్వారా సౌదీ అరేబియా లోని తెలుగు సంఘాలతో సంప్రదింపులు జరిపి వారు క్షేమంగా ఉండేలా, వారికి భారత ఎంబసీ బోజనాలు అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. మా శాఖ అధికారులు ఎప్పటికప్పుడు విదేశాంగ శాఖ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో ఈ అంశంపై చర్చించి చర్యలు చేపట్టాం. అక్కడే ఉన్న తెలుగు సంఘాల సహకారం తీసుకుంటాం. వీలైనంత త్వరగా వారిని స్వస్థాలకు తీసుకువస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాల్లో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తాము. ఎన్డీయే ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధికి, యువతలో నైపుణ్య శిక్షణ పెంపొందించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడతాము…

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు టాలెంట్ టెస్ట్

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ముస్లిం విద్యార్థులకు వక్ఫ్ బోర్డు నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ ను సద్వినియోగం చేసుకోవాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *