తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి ముస్లిం ,సమాజంలో క్రమశిక్షణతో దాతృత్వ బుథ్థితో మెలగాల్సిన విథి విథానాలను రంజాన్ పవిత్రమాసం నిర్థేశిస్తుందని గుంటూరు MP అభ్యర్ఠి పెమ్మసాని చంద్రశేఖర్అన్నారు. ఆదివారం సాయంత్రం తెనాలి నటరాజ్ థియోటర్లో తెనాలి అసెంబ్లీపరిథిలోని ముస్లిం సోదరుల ఇఫ్తార్ విందులో ఆయన మాట్లాడుతూ ఈ కొద్దిరోజుల ముస్లిం సోదరులతో పరిచయం పరులఆకలిని తృప్తిగా తీర్చే విథం, పరస్పరం ఆహార పదార్థాలు తినిపించటం తనకు ఎంతో ఆనందం ఇచ్చిందని ముస్లిం లకు ఏసమస్య వచ్చినా తమ ఉమ్మడి ప్రభుత్వం ముందుంటుందని అన్నారు.
మాజీ మంత్రి ఆలపాటి రాజా మాట్లాడుతూ ముస్లింలకు4%రిజర్వేషన్ ప్రతిపాదనలు తాము చేశామని లౌకిక వాదం కాపాడటంలో బాబు పవన్ కల్యాణ్ లు ముందుంటారని జగన్ ప్రభుత్వం పేదోణ్ణి కటిక పేదోణ్ణి చేసి తలా సగటున 3లక్షలు అప్పుల్లోనెట్టాడని , NAA CAA అంటు కొందరు మసిబూసి మారేడుకాయ చేసేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.
జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ ఉర్దూలో ప్రసంగిస్తూ ఉద్దేశ్యపూర్వకంగా షాదిఖానాలు మసీదులు ఈద్గా నిర్మాణాలు ఆపిందని తాము అథికారం చేపట్టిన వెంటనే ఆనిర్మాణాలు పూర్తిచేయటమే కాకుండా ఆపిన పథకాలను పునరథ్థరిస్తామని అన్నారు. అనంతరం ముస్లిం లందరూ దువా చేశారు. ఈ ఇఫ్తార్ లో దాదాపు 3 వేల మంది హాజరయ్యారు.
Prajavartha Online Telugu News