రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల సాధారణ పరిశీలకులు కె.బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం స్థానిక మున్సిపల్ కమిషనర్ ఛాంబర్ నందు నామినేషన్ పరిశీలన ప్రక్రియను పరిశీలించడం జరిగింది. నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన అభ్యర్ధుల సమక్షంలో మున్సిపల్ కమిషనర్, రాజమండ్రీ అర్బన్ అసెంబ్లి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కె.దినేష్ కుమార్, పరిశీలించడం జరిగింది.
ఈ సందర్బంగా కె. బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ అత్యంత పారదర్శకంగా జవాబుదారీ తనంతో కూడిన నామినేషన్ పత్రాలు పరిశీలన నిర్వహించాలని సూచించారు. నామినేషన్ తిరస్కృతికి సంబందించి సహేతుకమైన కారణాలు వివరించాలని తెలియచేశారు. నియోజకవర్గ పరిధిలో ఎన్నికల నిర్వహణ తీరును సూక్ష్మంగా పరిశీలించడానికి సాధారణ ఎన్నికల పరిశీలకులుగా ధవళేశ్వరం కాటన్ గెస్ట్ హౌస్ నందు సాయంత్రం 4:00 నుండి 5:00 వరకు మే 12 వ తేదీ వరకు రాజకీయ పార్టీలకు, ప్రజలకి అందుబాటులో ఉంటామని ఆయన తెలియచేశారు. ఎన్నికలకి సంబంధించిన ఎటువంటి ఫిర్యాదులనైనా నేరుగా అందచెయ్యవచ్చునని, ఫోన్ నంబర్ 8977935105 ఫోను ద్వారా ఫిర్యాదు చేయవచ్చునని కె.బాల సుబ్రహమణ్యం వారు తెలియచేశారు.
నామినేషన్ పరిశీలనకు చెందిన వివరాలను రిటర్నింగ్ అధికారి కె.దినేష్ కుమార్ వివరిస్తూ, రాజమండ్రీ సీటీ అసెంబ్లి నియోజక వర్గ పరిధిలో 13 మంది అభ్యర్థుల ద్వారా 21 నామినేషన్ దాఖలు చెయ్యడం జరిగిందని, నామినేషన్ పరిశీలన అనంతరం 2 నామినేషన్లు వేలిగట్ల సుబ్రహ్మణ్యం (భారతీయ చైతన్య) మరియు మార్గాని నాగేశ్వరరావు (వై.ఎస్.ఆర్.సి.పి) తిరస్కరించినట్లుగా తెలియచేశారు.
నామినేషన్లు ఉపసంహరణ గడువు ఏప్రియల్ 29 మధ్యహ్నం 3 గంటలతో ముగుస్తుందని అభ్యర్థులకు తెలియ చెయ్యడం జరిగింది.