Breaking News

భయం వద్దు-ముస్లింలకు నేను అండగా ఉంటా

-మోదీ వస్తున్నారు-పశ్చిమకు మహర్ధశ తెస్తా
-చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన నాయకుడు ప్రజలకు ఏం చేశారో చెప్పాలి
-వన్ టౌన్ ప్రచారంలో సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటమి భయంతోనే ముస్లింలను కొన్ని పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నాయని పశ్చిమ ఎన్డీఏ అభ్యర్థి సుజనా చౌదరి దుయ్యబట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం 55వ డివిజన్ టిడిపి అధ్యక్షులు షేక్ జాహెద్ వడ్డాది రమణ తో కలిసి కంసాలిపేట తమ్మిన పోతరాజు వీధి ఎర్రకట్టా దనేకుల సుబ్బారావు ర్యాంపు తదితర ప్రాంతాలలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా సుజనాకు పలువురు మహిళలు స్థానిక సమస్యలను వివరించారు. ఇరుకు రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతోపాటు మౌలిక సదుపాయాల కల్పన బాధ్యతను తీసుకుని పనిచేస్తానని సుజనా హామీ ఇచ్చారు. ముస్లిం రిజర్వేషన్లపై జరుగుతున్న ప్రచారంపై సుజనా స్పష్టత ఇచ్చారు. ఓటమి భయంతోనే ముస్లింలను బీజేపీకి వ్యతిరేకంగా కొన్ని పార్టీలు రెచ్చగొడుతున్నాయన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ముస్లింలకు అండగా ఉండే బాధ్యత తనదని స్పష్టం చేశారు. తాను గత నాయకుల్లా మాటలు చెప్పే వ్యక్తిని కానని, డబుల్ ఇంజిన్ సర్కార్ తో అభివృద్ధి ఎంత చేస్తామో మీరే చూస్తారంటూ ధీమాగా చెప్పారు. కేంద్ర, రాష్ట్ర స్థాయిలో పని చేసిన తన అనుభవాన్ని నియోజకవర్గం ప్రజల కోసం ఉపయోగిస్తానన్నారు. మే 3న ప్రధాని మోదీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి వస్తున్నారని చెప్పారు. త్వరలోనే ఈ నియోజకవర్గానికి మహర్దశ పట్టబోతోందని జోస్యంచెప్పారు. ప్రత్యర్థి పార్టీలు తనపై నిందలు వేయడం సహజమని, దిగజారి మాట్లాడేవారి గురించి తాను స్పందించబోనని సుజనా తేల్చి చెప్పారు. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసిన వ్యక్తి ప్రజలకు ఏం చేశారో చెప్పాలని పరోక్షంగా కేశినేని నానిపై సెటైర్ వేశారు. పశ్చిమ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదలుగా మిగిలిపోయారని అన్నారు. డ్రైనేజీ, విద్యుత్ వ్యవస్థలు అధ్వాన్నంగా ఉన్నాయన్నారు. కూటమిని భారీ మెజారిటీతో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. సుజనా కు మద్దతుగా ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ టిడిపి రాష్ట్ర కార్యనిర్వహ కార్యదర్శి ఎం ఎస్ బెగ్ జనసేన నాయకులు అమ్మిశెట్టి వాసు బాడిత శంకర్ కన్నా రజిని బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *