కొండపల్లి, నేటి పత్రిక ప్రజావార్త :
కొండపల్లి మునిసిపాలిటీ లో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్దానికులను కలిసి సైకిల్ గుర్తుకు ఓట్లు వేయాలని మరోసారి నాన్నని ఎమ్మెల్యే గా గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, బిజేపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గ ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్, విజయవాడ పార్లమెంటు అభ్యర్థి కేశినేని శివనాధ్ (చిన్ని)లను గెలిపించాలని సైకిల్ గుర్తుకు మీ ఓట్లు వేయాలని ప్రజలకు విజ్ణప్తి చేశారు. యువనేత ధీమంత్ సాయి ఎన్నికల ప్రచారంలో జనసేన తెలుగుదేశం బీజెపీ నాయకులు కార్యకర్తలతో పాటు తెలుగు యువత ఐటిడిపి TNSF నేతలు పాల్గొన్నారు.
Tags Kondapalli
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …