Breaking News

బస్సుప్రమాద ఘటనపై హోం మంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్భ్రాంతి

యర్నగూడెం, నేటి పత్రిక ప్రజావార్త :
పల్నాడు జిల్లా చిలకలూరిపేట వద్ద బస్సు ప్రమాదంలో ఆరుగురు మరణించిన ఘటనపై హోంమంత్రి తానేటి వనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు హోంమంత్రి ప్రగాడ సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ మేరకు యర్నగూడెంలోని హోం మంత్రి క్యాంపు కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేశారు. చిలకలూరి పేట సమీపంలోని పసుమర్రు వద్ద హైదరాబాద్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు – టిప్పర్ లారీ ఢీకొట్టడంతో మృతి చెందారన్న వార్త తెలియగానే తన మనసును కలిచి వేసిందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *