Breaking News

ఎస్పీ తో కలిసి ఈవీఏం లు భద్రపరచిన స్ట్రాంగ్ రూమ్ లు పరిశీలన

-24 x 7 మూడంచెల భద్రత.. కేంద్ర బలగాలు పహారా
-కేంద్ర, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, మొబైల్ టీమ్స్ ఏర్పాటు
-సిసి కెమెరాల చిత్రీకరణ.. ఈవీఎమ్ భధ్రత పై సమీక్ష
-నిఘా వ్యవస్థ పై దిశా నిర్దేశం .. ముందస్తు జాగ్రత్తలు పై ఆర్వో లకు ఆదేశాలు
-కౌంటింగ్ ఏర్పాట్ల పై సమీక్ష
-కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజానగరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఏడు అసెంబ్లి, రాజమండ్రీ పార్లమెంటు నియోజక వర్గాలకు సంబంధించి పోలింగు అయన బ్యాలెట్ , కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ అత్యంత జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందనీ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు. గురువారం సాయంత్రం స్థానిక నన్నయ్య యూనివర్సిటీ ఆవరణలోని స్ట్రాంగ్ రూమ్ లని పరిశీలించి, అక్కడ రిజిస్టర్ లో కలెక్టర్, ఎస్పి సంతకాలు చెయ్యడం జరిగింది. తదుపరి స్ట్రాంగ్ రూమ్ లో భద్రతా, కౌంటింగ్ ఏర్పాట్ల పై సమీక్ష నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీ లత మాట్లాడుతూ, జూన్ 4 వ తేదీన పోలింగు అయిన ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటి నుంచి ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించడం, ఆమేరకు సంభందిత నివేదికలను నిర్ణీత సమయం అనుసరించి సమర్పించాల్సి ఉంటుందనీ ఆదేశించారు. పోలైన ఈవీఏమ్ లు భద్రపరిచే క్రమంలో కేటగిరి ” ఏ ” బి” యూనిట్స్ మరియు కేటగిరీ”సి’ డి” లకి చెందిన యూనిట్స్ భద్రపరచడం లో ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసిందన్నారు. ఆయా యూనిట్స్ సురక్షిత మరియు భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. మూడు షిఫ్టుల్లో స్ట్రాంగ్ రూమ్ ల వద్ద బందోబస్తు, గెజిటెడ్ అధికారుల పర్యవేక్షణ బాధ్యతలను నిర్వహించాల్సి ఉంటుందని ఆమేరకు ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతర నిఘా పెట్టినట్లు తెలిపారు. ఒకటి రెండు సార్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు స్ట్రాంగ్ రూమ్ లో ఎటువంటి షార్ట్ సర్క్యూట్ జరుగకుండా విద్యుత్ సరఫరా నిలుపుదల చేయాలని ఆదేశించారు. స్ట్రాంగ్ రూమ్ లో ఏర్పాట్లు, జూన్ 4 న కౌంటింగ్ రోజున చెయ్యవలసిన కార్యచరణ ప్రణాళికా పై చర్చించడం జరిగింది.

ఎస్పీ పి జగదీష్ మాట్లాడుతూ, నన్నయ్య యూనివర్సిటీ వద్ద మూడంచెల భధ్రత ఏర్పాట్లు చేశామన్నారు. సర్కిల్ ఇన్స్పెక్టర్, డి ఎస్పి , మొబైల్ టీమ్, సి ఆర్ పి ఎఫ్, ఆర్మ్డ్ రిజర్వ్ ఫోర్సెస్, రాష్ట్ర పోలీస్ యంత్రాంగం ఆధ్వర్యంలో పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవడం జరిగిందనీ తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద 144 సెక్షన్ అమలులో కౌంటింగ్ ముగిసే వరకు అమలులో ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన ఆదేశాల మేరకు ఎటువంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా జిల్లా యంత్రాంగానికి తగిన సహకారం అందించాలని కోరారు.

ఈ సమావేశంలో రిటర్నింగ్ అధికారులు రాజమండ్రీ రూరల్ జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రీ సిటి మునిసిపల్ కమిషనర్ కే దినేష్ కుమార్, కొవ్వూరు సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్, రాజానగరం ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, అనపర్తి ఎమ్. మాధురీ, నిడదవోలు ఎస్ డీ సి ఆర్ వి రమణ నాయక్, గోపాలపురం ఎస్ డీ సి కే ఎల్ శివ జ్యోతి, అదనపు ఎస్పీ లు ఎల్. చెంచి రెడ్డి, కే ఆర్ ఆర్ సి ఎస్ డి సి ఆర్. కృష్ణ నాయక్, డిఎస్పీ కే. శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలి…

మొవ్వ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి పేదవాడు పక్కా ఇల్లు నిర్మించుకుని గౌరవంగా జీవించాలని ప్రభుత్వ లక్ష్యమని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *