జి.కొండూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మైలవరం నియోజకవర్గ తెదేపా కూటమి అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు జి.కొండూరు మండలంలోని సున్నంపాడు, మునగపాడు గ్రామాల్లో గురువారం పర్యటించారు. మునగపాడులో సాయిబాబా వారి ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో తన కోసం కష్టపడిన వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామాల్లో శాంతియుతంగా ఎన్నికలు జరిగేందుకు సహకరించిన కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు. అందరికీ రుణపడి ఉంటానన్నారు. ఆయా గ్రామాల్లో పోలింగ్ సరళిని, ఓటింగ్ శాతం నమోదుపై నాయకులతో సమీక్ష నిర్వహించారు.ఈ ఎన్నికల్లో మహాకూటమి విజయం తథ్యమని అన్నారు. బీజేపీ, జనసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News