-రాష్ట్ర డీజీపీ కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు ఆదేశాలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల జరిగిన ఎన్నికల తరువాత రాష్ట్రములోని కొన్ని జిల్లాల్లో ఉత్పన్నమవుతున్న రాజకీయ ,కుటుంబ కక్షలు కార్పణ్యాలు ప్రభావం వలన బాలలు మీద, మహిళలు( గర్భీనీలు, బాలింతలు) మీద , కొన్ని జిల్లాల్లో విచక్షణా రహితంగా విద్వంసాలు, దాడులు, చెదురు మదురు దురదృష్టకర సంఘటనలు నేపథ్యంలో ఆ యా ప్రాంతాల్లో నివసిస్తున్న బాలలు భయ భ్రాంతులు కి గురై తీవ్ర ఇబ్బందలకు గురైతున్నట్టు ప్రింట్, ఎలక్ట్రానిక్,సోషల్ మీడియా ద్వారా మరియు బాలలు తో పనిచేసే సంఘాలు, ప్రతినిధి లు ద్వారా రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ కి ఫిర్యాదులు వస్తున్నాయని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు.
ఈ నేపథ్యంలో మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా బాలల భద్రత కోసము కట్టుదిట్టం గా తదుపరి ముందస్తు చర్యలు తీసుకోవాలని, జరిగిన వాటిపై ఒక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ తరుపున DGP గారికి కమిషన్ తరుపున ఆదేశాలు జారీ చేయడం జరిగింది.