Breaking News

బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లడంతో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సంబరాలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అంధ్రప్రదేశ్ లో బీజేపీ విజయం దిశగా దూసుకెళ్లడంతో బిజెపి రాష్ట్ర కార్యాలయం లో సంబరాలు అంబరాన్ని తాకాయి. బీజేపీ పార్టీ కార్యాలయం ముందు బీజేపీ నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాల్లో మునిగితేలారు. డప్పు వాయిద్యాలు తో హోరెత్తించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఎన్నికల సహా ఇన్చార్జి సిదార్థ్ నాథ్ సింగ్. 2024 విక్టరీ పేరు తో కేక్ కట్ చేసి సంబరాలు ప్రారంబించారు.

ఈ సందర్భంగా సిద్దార్థ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు అంధ్రప్రదేశ్ లోపార్టీని గెలిపించాయని అన్నారు. కన్నడ ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారన్నారు. తెలుగు ప్రజలు బీజేపీకి మద్దతు పలికారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా అభివృద్ధి పరుగులు పెడుతుంది న్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగవంతం చేస్తామన్నారు. ఎపి లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రి గా నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రంలో తెలుగు దేశం,జనసేన సంకల్ప పత్రం, బిజెపి జాతీయ స్తాయిలో మేనిఫెస్టో అమలు చేస్తామన్నారు.

బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేటుకూరి సూర్య నారాయణ రాజు, రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్రాశివన్నారాయణ, రాష్ట్ర మీడియా ఇంఛార్జి పాతూరి నాగభూషణం, ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చిగురు పాటి కుమార స్వామి, మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామినీ శర్మ, బిజెపి నేతలు కిలారు దిలీప్, వాసిరెడ్డి, సుబ్బయ్య,చైతన్య,మాదల రమేష్,పియూష్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ మౌలిక సదుపాయాలు కల్పించాలి  కలెక్టరు ప్రశాంతి

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రభుత్వ లే అవుట్ లలో మౌలిక సదుపాయాలు కల్పించడం కు తగిన ప్రాధాన్యత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *