విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉమ్మడి ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి, దివంగత నేత డా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75 వ జయంతి వేడుకలు ఈ నెల 8న విజయవాడ CK కన్వెన్షన్ సెంటర్ లో ఘనంగా జరగనున్నాయి. YSR గారికి ఘనంగా నివాళులు అర్పించడానికి, ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలు, ఏపి, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు రానున్నారు. ఇందులో భాగంగానే ఇవ్వాళ తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ని, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ని, ఇతర క్యాబినెట్ మంత్రులను కలిసి, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి ఆహ్వానాలు అందించడం జరిగింది. అంతేకాకుండా సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో YSR కి అత్యంత సన్నిహితులుగా పేరున్న ఇతర పార్టీ నాయకులను సైతం 75 వ జయంతి వేడుకలకు ఆహ్వానించనున్నట్లు వైఎస్ షర్మిలా రెడ్డి తెలిపారు. పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వైఎస్ అభిమానులు పెద్ద ఎత్తున హాజరై, మహానేత జ్ఞాపకాలను స్మరించుకోవాలని, అలాగే అయన బిడ్డగా, అయన అహర్నిశలూ ప్రేమించి, శ్రమించిన పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఈ వేడుకలు జరిపించే అవకాశం రావటం తనకు గొప్ప వరం, అని వైఎస్ షర్మిల రెడ్డి తెలిపారు.
Tags vijayawada
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …