తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ మహిళా ప్రాంగణము, తిరుచానూరు రోడ్డు నందు రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి, జిల్లా కార్యదర్శి, సుబ్బరాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ( APGEA) మహిళా విభాగం యొక్క నూతన కార్య నిర్వాహక సభ్యులు ని ఎన్నుకోవడం జరిగింది. అందరికీ తెలుసు APGEA ఉద్యోగుల సంఘం అంటే అన్ని డిపార్ట్మెంట్స్ నుండి, అన్ని క్యాడర్స్ నుండి సంఘంలోకి సభ్యులు తీసుకుంటుంది. అదేవిధంగా ఈరోజు మహిళా విభాగానికి కార్యనిర్వహక వర్గాన్ని అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రతినిధులు ఉండే విధంగా శ్రద్ధ తీసుకొని ఎన్నుకోవడం జరిగింది. ఇందులో APGEA జిల్లా మహిళా విభాగ ప్రెసిడెంట్ గా శాంతి దుర్గా ను, కార్యదర్శిగా నాగమణిని, ట్రెజరర్ గా హరితను, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చిట్టెమ్మను, వైస్ ప్రెసిడెంట్స్ గా ఈశ్వరమ్మ (PRO, I &PR ), మాధవి ( DPO,DRDA ), Dr,ఫర్జానా (DM, Pranganam ), Dr. Tejeswari ( MO, health dept ), చెంచులక్ష్మి (FRO, forest dept ), జాయింట్ సెక్రటరీస్ గా ఎంపీ. వనజ, కావమ్మ, చందన, అరుణ, కృష్ణవేణి, EC మెంబెర్స్ గా అరుణ దీపిక, నిఖిల ఆదిలక్ష్మి ఈ సమావేశానికి స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీపతి, జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు, స్టేట్ కమర్షియల్ టాక్స్ వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి హాజరయ్యారు.
మహిళా ఉద్యోగుల సంఘం లక్ష్యాలు :
మహిళా అభ్యున్నతికి మహిళా సాధికారతకు మహిళ వలన, మహిళల కొరకు, మహిళల చేత స్థాపించబడిన సంస్థ ఇప్పుడు చాలా అవసరం, ఎప్పటికీ అనివార్యం. 40% మహిళలు ప్రభుత్వరంగ సంస్థలలో పనిచేస్తున్నారు. త్వరలో 50 శాతానికి పెరుగుతుంది. కుటుంబాన్ని సమాజాన్ని తీర్చి దిద్దటంలో మహిళలు మంచి నిర్ణయాలను తీసుకోవటంలో ఎంతో నైపుణ్యాన్ని కలిగి ఉంటారు. మగవారిని ముందుకు నడిపించడానికి ఎంతో సహకారాన్ని అందిస్తూ వస్తున్నాము. ఈ రోజు మగవారి సహకారం తో మనం ప్రాతినిధ్యం వహించవలసిన అవసరం చాలా వుంది.
1.మహిళ ఉద్యోగుల గౌరవాన్ని పెంపొందించడం
2.మహిళలకు పరిపూర్ణ భద్రత కల్పించదం
3.మహిళా ఉద్యోగులు ముఖ్యమైన మానవ వనరులుగా గుర్తింపబడటం.
4 మహిళల ఉద్యోగుల ప్రగతికి మూలధనం కాబట్టి వారు ప్రాతినిధ్యం వహించేటట్టు చూడటం
5 మహిళ ఉద్యోగుల సామర్థ్యాన్ని నైపుణ్యాన్ని పెంచటం
6.మహిళల ఉద్యోగుల నిర్ణయాలకు అధికారతను చట్ట భద్రతను కల్పించటం