Breaking News

ఏపీలో పెట్టుబడుదారులకు విస్తృత అవకాశాలు

-రెన్యూబుల్ ఎనర్జీలో పెట్టుబడులకు రెడ్ కార్పెట్
-విద్యుత్ రంగంలో పెట్టుబడి పెట్టే సంస్థలతో చర్చలకు సిద్ధం
-ఎనర్జీ అసోషియేషన్స్ తో భేటీలకు విద్యుత్ శాఖ ప్రాధాన్యం
-గత ఐదేళ్లలో ఏపీకి వచ్చిన పెట్టుబడులు శూన్యం
-పెట్టుబడిదారులను వైసీపీ భయపెట్టింది
-సీఎం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సన్ రైజ్ స్టేట్ గా ఏపీ
-ప్రవాస భారతీయులకు పిలుపునిచ్చిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ఉన్నాయని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. ఏపీకి ఉండే భౌగోళిక పరిస్థితులు దేశంలో మరే రాష్ట్రానికి లేవని కొనియాడారు. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు నిశ్చింతగా పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు రావాలని ఆహ్వానిచ్చారు. ఈ మేరకు విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అమెరికాలోని ప్రవాస భారతీయులతో వర్చువల్ గా సమావేశం అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రవాస భారతీయులు ముందుకు రావాలని కోరారు.

పెట్టుబడిదారులకు కావాల్సిన వసతులను కల్పించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని మా ప్రభుత్వం అన్నీ విధాల సిద్ధంగా ఉందని తెలిపారు. గత ప్రభుత్వ విధానాల వల్ల పారిశ్రామిక వేత్తలు రాష్ట్రానికి రావాలంటే భయపడ్డారని అన్నారు. రాజకీయంగా వేధించడంతో చాలా సంస్థలు పెట్టుబడుల ఒప్పందాల్ని రద్దు చేసుకోవడంతో పాటు కొత్తగా పెట్టుబడులు కూడా రాలేదని చెప్పారు. పారిశ్రామిక వేత్తల్లో మళ్లీ నమ్మకం కలిగించే దిశగా కూటమి ప్రభుత్వం అడుగు వేస్తుందని పేర్కొన్నారు. రాబోయే ఐదేళ్లకు సంబంధించి దేశంలో అత్యుత్తమ పారిశ్రామిక విధానం పెట్టుబడిదారుల కోసం త్వరలోనే తీసుకుని వస్తామని స్పష్టం చేశారు.

వారితో చర్చలకు ఏపీ ప్రభుత్వం సిద్ధం…
విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి తమ ప్రభుత్వం పెద్దపీఠ వేస్తుందని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అన్నారు. సోలార్, విండ్ ఎనర్జీలకు సంబంధించిన పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకు రావాలని కోరారు. గత ప్రభుత్వంలో ‘ది నేషనల్ సోలార్ ఎనర్జీ ఫౌండేషన్’, ‘ఇండియన్ విండ్ పవర్ అసోషియేషన్’, ‘ఆసోచామ్’ లాంటి అసోషియోషన్స్ సలహాలకు, విజ్ఞప్తులకు ప్రాధాన్యత దక్కలేదని అన్నారు. గతంలో ఏపీ ప్రభుత్వం నిర్ణయాల కారణంగా విద్యుత్ రంగం నష్టపోయినట్లు పేర్కొన్నారు. కొత్తగా పెట్టుబడులు పెట్టకపోగా ఉన్న కంపెనీలు రాష్ట్రాన్ని విడిచి వెళ్లిపోయిన పరిస్థితి నాడు ఉండేదన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ఎస్ఈఎఫ్ఐ, ఐడబ్ల్యూపీఏ, ఆసోచామ్ లాంటి అసోషియేషన్స్ సలహాలు, సూచనలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

పెట్టుబడులను తీసుకుని రావడంతో పాటు స్థానికంగా ఉన్న యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యం అని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 20 లక్షల ఉద్యోగాల కల్పనకు కట్టుబడి ఉన్నామని అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *