అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
బుధవారం (ఈ నెల 07) డాక్ చౌపాల్ (గడపకు-గడపకు-పోస్టాఫీసు) అనే కార్యక్రమం గన్నవరంలో ని ఆర్. టి. సి. వర్క్ షాప్ నందు ఉదయం 11.00 గంటల కు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమంలో ఆర్. టి సి సిబ్బంది మరియు తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ ఎమ్.నరసింహ స్వామి మరియు తపాలా శాఖ ఇన్స్పెక్టర్ ఎమ్. సత్యనారాయణ పాల్గొని తపాలా శాఖ ఇచ్చే సేవల గురించి వివరించడం జరుగుతుంది. కావున గన్నవరం మరియు తదితర ప్రాంత ప్రజలు అందరూ ఈ కార్యక్రమానికి హాజరు అయ్యి పోస్టాఫీసు ఇచ్చే సేవలని ఉపయోగించుకోవలసినది గా తపాలా శాఖ సీనియర్ సూపరింటెండెంట్ ఎమ్. నరసింహ స్వామి ప్రకటన ద్వారా తెలిపారు.
Tags AMARAVARTHI
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …